రామనామము రామనామము రమ్యమైనది రామనామం
పరమ శివుని అంతరంగాన ఆదరమొప్పిన రామనామం
తాపసులు తపములో అనవరతం కొలిచే రామనామం
హనుమ హృదిలో సదా నిలచి మెరిసే రామనామం
అహల్యా శాపవిమోచననుగ్రహించిన యా రామచంద్రుడు
జటాయు త్యాగనిరతికి సాయుజ్య మోక్షాన్నిఅనుగ్రహించిన రామచంద్రుడు
భక్తితో కూడిన వాత్సల్యాతిథ్యానికి శబరికి మోక్షమిచ్చిన రామచంద్రుడు
‘దాసబోధన’ నాలపించిన ‘సమర్థ రామదాసు’ కొలిచిన రామచంద్రుడు
‘త్యాగయ్య’ అమర గానానికి మధుర భావనల కూర్చిన రామచంద్రుడు
‘తులసీదాసు’ అసమాన ‘రామచరితము’ నకు మానసమైన రామచంద్రుడు
‘పోతన’ కవితా చాతుర్య మాధుర్యానికి మూలమైన రామచంద్రుడు
గోపన్నని రుణవిముక్తుని చేసి ‘రామదాసు’ గా ఖ్యాతి నిచ్చిన రామచంద్రుడు
తలచినంత మాత్రాన భక్తుల హృదయ కుహరాలలో వెలుగు నింపే రామచంద్రుడు
‘రామకోటి’ కూర్పుకి, భక్తుల గాన నేర్పుకి ఆలంబనైనదే రామనామం
అందుదాగిన దైవత్వమే ఇహ పరాలకి దారి చూపే వెలుగు ధామం.