Menu Close
మనోల్లాస గేయం
మధు బుడమగుంట

ఇది మల్లెల వేళయనీ

చిత్రం: సుఖదుఃఖాలు (1968); సంగీతం: కోదండపాణి;
గీతరచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: సుశీల

ఈ వీనులవిందయిన పాటను ఇక్కడ వినవచ్చు →

పల్లవి:
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

చరణం 1:
కసిరే ఎండలు కాల్చునని.. ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని.. మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది..
ఎరుగని కోయిల ఎగిరింది.. చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది
ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

చరణం 2:
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం.. కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం.. వసి వాడని కుసుమ విలాసం

ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

చరణం 3:
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో..
మోసం ద్వేషం లేని సీమలో.. మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ.. ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల.. ముందే కూసిందీ విందులు చేసింది

********

Posted in April 2026, పాటలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *