గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
28. దేవులపల్లి దుర్గాప్రసాద్
(రెండవ ముగింపు )
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది శీర్షిక: ఎదురు చూద్దాం
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది. అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది. కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్‌గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
***
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,
"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
***
నా మరో ముగింపు...
అఖండ భారతదేశ యాత్రకు బయల్దేరుతున్న శ్యామల ను చూసి ఎవరూ హర్షించలేదు. ఎందుకంటే.. ఆ వయసులో అందరు వెళ్ళే విధంగా శ్యామల రైలులోనో, బస్సులోనో, విమానం లోనో వెళ్ళడం లేదు. ఆరు నెలలపాటు కష్టపడి నేర్చుకున్న మోటార్ సైకిల్ చోదనలో నైపుణ్యం సంపాదించి, తనలాంటి ఔత్సాహికులైన మరికొంత మంది యువతీ యువకులతో ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టింది.
తన జీవితంలో తాను పడ్డ అనేక కష్ట నష్టాలు ఆమెను శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేసాయి ఈ యాత్రకి.
మరి మనం కూడా జై కొట్టాల్సిందే శ్యామల సంకల్పానికి! యాత్ర సుఖవంతంగా, శుభప్రదంగా పూర్తి చేసుకు వచ్చే శ్యామల కోసం ఎదురుచూద్దాం !!
*****
29. స్వాతి తక్కెళ్ళపల్లి
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది శీర్షిక: టర్నింగ్ పాయింట్
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది. అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగా అనారోగ్యం శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది. కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్‌గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
***
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయంకొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,
"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
ముగింపు:
శ్యామలమ్మను ఈ మాటలు, తన లక్ష్యం నుండి తప్పించలేకపోయాయి సరికదా... వాళ్లందరినీ తన వెనకే నడిచేలా చేశాయి.
శ్యామలమ్మ కొన్ని నెలల తర్వాత, ఓరోజు సాయంకాలం తనకు కావలసిన బట్టలు షాపింగ్ చేసుకొని సంతోషంగా ఇంటి దారి పట్టింది. రాత్రిపూట పెందళాడే భోంచేసి, కాసేపు వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల వీడియోలు చూసి, నిద్రకు సిద్ధమైంది. కళ్ళను, నిద్రాదేవి ఎంతకూ చుట్టుముట్టదే? ఇంతలో అప్రయత్నంగా... సంవత్సరం క్రితం జరిగిన సంఘటన తన కళ్ళముందు మెదిలింది.
ఆరోజు... తను పనిచేసిన కాన్వెంటు స్కూలు పిల్లలు, 'గెట్ టు గెదర్' అంటూ, తమకు చదువు చెప్పిన టీచర్లందరినీ ఆహ్వానించి, ఘనంగా సన్మానించడం, ఎదిగిన...ఆ పిల్లలతో పాటు తను తన సహోపాధ్యాయులను కలుసుకొని, ఆనాటి మధుర జ్ఞాపకాలను వల్లె వేసుకొని మురిసిపోవడమూ శ్యామలమ్మ మస్తిష్కంలో మెదలగానే... మనసు మళ్ళీ నెమలిలా నాట్యమాడింది. తను... ఇంతలా సంబరపడి ఎన్నాళ్ళైందో మరీ!
ఆ మీటింగ్‌లోనే... పాత స్టూడెంటొకరు ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్నాడనీ, తమ ఆరోగ్య సమస్యలు అడిగి మరీ తెలుసుకొని తగిన సలహాలూ, సూచనలూ అందించాడు. అప్పుడే... వయసుతో నిమిత్తం లేకుండా, సరైన శిక్షకుడి సారథ్యంలో ఎవరైనా వ్యాయామం చేయొచ్చని సూచించాడు. పైగా... అదే సిటీలో తన ఫిట్ నెస్ సెంటర్ ఉండడంతో... అక్కడి టీచర్సందరికీ ఫ్రీ ట్రైనింగిస్తానంటూ మరీ మరీ ఆహ్వానించాడు. అది విన్నాక, శ్యామలమ్మ మనసు ఉత్సాహంతో ఉరకలేసినా... కొడుకూ, కోడలూ, కూతురూ తూతూ మంత్రంగా ఒప్పుకున్నారు. చుట్టుపక్కల వారు," 'ముసలోడికి దసరా పండుగ' లాగా... ఈవిడకీవయసులో జిమ్ము కావాలంట జిమ్ము! కండలు పెంచి, ఏం చేస్తుందో మరీ!" అంటూ, తనకు వినబడేలానే చెవులు కొరుక్కునేవారు! తను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా... జిమ్ వేర్, షూసూ వేసుకొని... ఆనందంగా జిమ్ కు వెళ్ళేది. దాంతోపాటు వారానికోసారి యోగా, మెడిటేషన్ కూడా చేసేది. దాంతో తను ఆరోగ్యంగా ఉండడమే కాదు మునుపటి కంటే చురుకుగా మారింది. పైగా... నేర్చుకోవాలన్న తన తపన చూసి అక్కడి ట్రైనర్, ఆమెకు 'వెయిట్ లిఫ్టింగ్' లో శిక్షణనిచ్చి, పోటీలో నిలబెట్టాడు. ఆమె... పవర్ లిఫ్టింగ్‌లో యాభై సంవత్సరాలు పైబడిన మాస్టర్స్-3 విభాగంలో డిస్ట్రిక్ లెవెల్లో గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఈ విజయం... తనను తన చుట్టూ ఉండేవారి ముందు ఎంతో ఎత్తులో నిలబెట్టినా.... తను మాత్రం, జీవనపయనంలో ఎన్నో బరువులు మోసిన అనుభవం ఊరికే పోలేదనుకుంది. అరవై రెండేళ్ళ వయసులో... తను ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోవడమే సాహసమనుకుంది. కానీ, ఇప్పుడు ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడంతోపాటు, తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు తమ కాలనీలో ఉన్న, తన ఈడు వారందరికీ... ఆమె హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్ సైజుల ప్రాముఖ్యత వివరిస్తూ, వారితో ప్రాక్టీస్ చేయిస్తూ తనలానే అందరి జీవితాలనూ మెరుగుపరుస్తోంది... కుటుంబ సభ్యుల తోడు లేకుండానే! మరి... ఒంటరితనం తన నేస్తం కదా!
మరో రెండ్రోజుల తర్వాత, గోవాలో జరిగే నేషనల్ పోటీల్లో తనకు పాల్గొనే గొప్ప అవకాశం లభించింది. అందుకే... గోవా ప్రయాణానికి కావలసిన సరంజామా సర్దుకొని, ఎప్పుడెప్పుడు తెలవారుతుందాని ఎదురుచూస్తూ మెల్లిగా నిదురలోకి జారుకుంది శ్యామలమ్మ.