Menu Close
Lalitha-Sahasranamam-PR page title

త్రయోదశ అధ్యాయం (యోగినీ న్యాసము)

శ్లోకాలు: 98-110/1, సహస్రనామాలు: 475-534

502. ఓం సమస్తభక్త సుఖదాయై నమః

తమ భక్తులైన వారందరికీ సుఖాలను చేకూర్చునట్టి మాతకు వందనాలు.


503. ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః

లాకినీ నామక అంబా స్వరూపిణికి వందనాలు.


504. ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః

ఆరు దళాలతో కూడిన స్వాథిష్టానమనే కమలంలో విరాజిల్లు దేవికి వందనాలు.


505. ఓం చతుర్వక్త్ర మనోహరాయై నమః

చతుర్ముఖాలతో భాసిల్లు మనోహరమూర్తికీ ప్రణామాలు.


506. ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః

శూలాదిగాగల ఆయుధాలను ధరించిన మాతకు ప్రణామాలు.


507. ఓం పీతవర్ణాయై నమః

పసుపుపచ్చని రంగుతో భాసిల్లు మాతకు వందనాలు.


508. ఓం అతిగర్వితాయై నమః

సౌందర్య, సంపాదాది మహత్తరాతిశయంచే అత్యంత గర్వంకల దేవికి వందనాలు.


509. ఓం మేదోనిష్ఠాయై నమః

మేదోనిష్టురాలైన మాతకు ప్రణామాలు.


510. ఓం మధుప్రీతాయై నమః

మధువును పాపం చేయడంలో ప్రీతిగా మాతకు వందనాలు.


511. ఓం బందిన్యాది సమన్వితాయై నమః

బందిని--ఆదిగాగల షడ్యోగినీ శక్తులతో పరివేష్టితయైన మాతకు నమస్కారాలు.


512. ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః

పెరుగుతో కూడిన అన్నమునందు విశేషమైన ఆసక్తీ-యిష్టముగల తల్లికి వందనాలు.


513. ఓం కాకినీరూప ధారిణ్యై నమః

కాకినీ నామక చక్రేశ్వరీ రూపధారిణికి వందనాలు.


514. ఓం మూలాధారాంబుజారూఢాయై నమః

మూలాధార చక్రంలో భాసిల్లునట్టి కమలకర్ణికలో భాసిల్లు దేవికి ప్రణామాలు.


515. ఓం పంచవక్త్రాయై నమః

పంచ ముఖాలతో తేజరిల్లునట్టి పంచముఖీశ్వరికి ప్రణామాలు.


516. ఓం అస్థి సంస్థితాయై నమః

అస్థి(ఎముక) నామకమైన ధాతువులో శక్తిరూపంలో విలసిల్లు దేవికి వందనాలు.


517. ఓం అంకుశాది ప్రహరణాయై నమః

అంకుశము-ఆదిగాగల ఆయుధాలతో ప్రహరించునట్టి మాతకు వందనాలు.


518. ఓం వరదాదినిషేవితాయై నమః

‘వరద’మొదలుగాగల 4 యోగినీగణాలచే సేవించబడు మాతకుప్రణామాలు


519. ఓం ముద్గౌదనాసక్త చిత్తాయై నమః

పులగమునందు ఆసక్తమైన చిత్తముగల దేవికి వందనాలు.


520. ఓం సాకిన్యంబా స్వరూపిణ్యై నమః

‘సాకిని’ అనే చక్రేశ్వరీ రూపంలో భాసిల్లు దేవికి ప్రణామాలు.


521. ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై నమః

భూమధ్య ప్రదేశంలో తేజరిల్లునట్టి ఆజ్ఞాచక్ర కమలం నిలయంగా గల దేవికి ప్రణామాలు.


522. ఓం శుక్లవర్ణాయై నమః

తెల్లటి వర్ణంతో ప్రకాశించు మాతకు వందనాలు.


523. ఓం షడాననాయై నమః

షణ్ముఖాలతో భాసిల్లునట్టి దేవికి నమస్కారాలు.


524. ఓం మజ్జా సంస్థాయై నమః

మజ్జా నామక ధాతువుతో ప్రకాశించు శక్తి స్వరూపిణికి ప్రణామాలు.


525. ఓం హంసవతీ ముఖ్యశక్తి సమన్వితాయై నమః

హంసవతి ఆదిగా గలిగిన ముఖ్యశక్తులతో పరివేష్టితయైయున్న శక్తికి వందనాలు.


526. ఓం హరిద్రాన్నైక రసికాయై నమః

పసుపు కలిపిన అన్నము-అంటే పులిహారయందు యిష్టముకల తల్లికి వందనాలు.


527. ఓం హాకినీ రూపధారిణ్యై నమః

హాకినీ రూపాన్ని ధరించి తేజరిల్లు మాతకు ప్రణామాలు.


528. ఓం సహస్రదళ పద్మస్థాయై నమః

శిరో పరిభాగంలో మధ్యస్థానంలో సహస్రదళాలతో భాసిల్లు పద్మంలో నివసించు మాతకు ప్రణామాలు.


529. ఓం సర్వవర్ణోప శోభితాయై నమః

సర్వవర్ణములవల్లనూ శోభిల్లునట్టి దేవికి వందనాలు.


530. ఓం సర్వాయుధధరాయై నమః

సర్వాయుధాలూ ధరించి తేజరిల్లునట్టి మాతకు ప్రణామాలు.


531. ఓం శుక్లసంస్థితాయై నమః

శుక్ల రూపమైన తేజోధాతువునందు జీవరూపంలో ప్రకాశించు తల్లికి ప్రణామాలు.


532. ఓం సర్వతోముఖాయై నమః

సర్వత్రా ముఖాలు గల సర్వతో ముఖరూపిణికి వందనాలు.


533. ఓం సర్వౌదనప్రీత చిత్తాయై నమః

సర్వవిధాన్నములయందు ప్రీతచిత్తం గల దేవికి వందనాలు.


534. ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః

‘యాకినీ’ నామక చక్రేశ్వరీ దేవికి వందనాలు.


* * * త్రయోదశ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in August 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!