Menu Close
Lalitha-Sahasranamam-PR page title

త్రయోదశ అధ్యాయం (యోగినీ న్యాసము)

శ్లోకాలు: 98-110/1, సహస్రనామాలు: 475-534

475. ఓం విశుద్ధిచక్ర నిలయాయై నమః

శుద్ధకమల కర్ణికలో తేజరిల్లు భవానికి ప్రణామాలు.


476. ఓం రక్త వర్ణాయై నమః

ఎఱ్ఱటి కాంతులతో భాసిల్లు పరమేశ్వరికి ప్రణామాలు.


477. ఓం త్రిలోచనాయై నమః

మూడు కనులు కల మాతకు వందనాలు.


478. ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః

ఖట్వాంగాది ఆయుధాలతో శత్రువులను కొట్టునట్టి దేవికి వందనాలు.


479. ఓం వదనైక సమన్వితాయై నమః

ఏకవదనయై భాసిల్లు జననికి వందనాలు.


480. ఓం పాయసాన్నప్రియాయై నమః

పరమాన్నమునందు విశేషం ప్రీతిగా దేవికి ప్రణామాలు.


481. ఓం త్వక్ స్థాయై నమః:

చర్మనామక ధాతువుతో తేజరిల్లు శక్తికి వందనాలు.


482. ఓం పశులోక భయంకర్యై నమః

పశు స్వరూపులైన పామరులకు అజ్ఞానులకు, దుష్టాత్ములకు భయాన్ని కలిగించునది తల్లికి వందనాలు.


483. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః

‘అమృత’ఆదిగాగల షోడశశక్తులచే పరివృతురాలైన లలితాంబకు వందనాలు.


484. ఓం డాకినీశ్వర్యై నమః

డాకినీ రూపిణియగు మాతకు వందనాలు.


485. ఓం అనాహతాబ్జ నిలయాయై నమః

అనాహత కమలం నిలయ స్థానంగా కలది.


486. ఓం శ్యామాభాయై నమః

శ్యామలవర్ణ శోభలతో అలరారు దేవికి వందనాలు.


487. ఓం వదనద్వయాయై నమః

రెండు ముఖాలతో భాసిల్లు తల్లికి ప్రణామాలు.


488. ఓం దంష్ట్రోజ్వలాయై నమః

దంష్ట్రలచే భాసిల్లు మాతకు ప్రణామాలు.


489. ఓం అక్షమాలాది ధరాయై నమః

అక్షరాలను ధరించిన మాతకు ప్రణామాలు.


490. ఓం రుధిర సంస్ధితాయై నమః

రుధిరనామక ధాతువులో తేజరిల్లు శక్తికి వందనాలు.


491. ఓం కాళరాత్ర్యాది శక్త్యౌ ఘవృతాయ నమః

‘కాళరాత్రి’ మొదలుగాగల పన్నెండుగురు శక్తులే చే పరివేష్టించబడిన మాతకు వందనాలు.


492. ఓం స్నిగ్ధౌదన ప్రియాయై నమః

ఘృతమిళితాన్నమగు స్నిగ్దౌదనమందు యిష్టముకల తల్లికి నమస్కారాలు.


493. ఓం మహావీరేంద్ర వరదాయై నమః

మహావీరుడైన త్రిమూర్తులకు సైతము వరాలను ప్రసాదించగల తల్లికి వందనాలు.


494. ఓం రాకిన్యాంబా స్వరూపిణ్యై నమః

అనాహతచక్రంలో భాసిల్లునట్టి రాకిన్యంబా స్వరూపిణికి ప్రణామాలు.


495. ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః

దశదళాలతో భాసిల్లునట్టి మణిపూరకమలంతో విలసిల్లు దేవికి నమోవాకాలు.


496. ఓం వదనత్రయ సంయుతాయై నమః

మూడుమోములతో తేజరిల్లు పరమేశ్వరికి ప్రణామాలు.


497. ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః

వజ్రాది ఆయుధాలను ధరించిన మాతకు నమస్కారాలు.


498. ఓం డామర్యాదిభిరా వృతాయై నమః

డామర్యాది దశావరణ శక్తులతో పరివేష్టించబడిన మాతకు ప్రణామాలు.


499. ఓం రక్తవర్ణాయై నమః

అరుణప్రభలతో భాసిల్లు తల్లికి వందనాలు.


500. ఓం మాంసనిష్ఠాయ నమః

మాంసనామక ధాతువు నందు భాసిల్లు శక్తికి వందనాలు.


501. ఓం గుడాన్నప్రీత మానసాయై నమః

బెల్లము తో కూడిన అన్నమునందు ప్రీతికల తల్లికి వందనాలు.

----సశేషం----

Posted in July 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!