Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ద్వాదశ అధ్యాయం (మంత్ర విద్య, సిద్ధ విద్య స్వరూప అమ్మవారు)

శ్లోకాలు: 87-97, సహస్రనామాలు: 401-474

442. ఓం కుమార గణనాథాంబాయై నమః

కుమార, గణపతులు వంటి బిడ్డలను కన్న మహా మాతృమూర్తికి నమోవాకాలు.


443. ఓం తుష్ట్యై నమః

తుష్టిరూపిణికి వందనాలు.


444. ఓం పుష్ట్యై నమః

పుష్టి స్వరూపిణికి వందనాలు.


445. ఓం మత్త్యై నమః

బుద్ధి స్వరూపిణియై భాసిల్లునట్టి మాతకు ప్రణామాలు.


446. ఓం ధృత్త్యై నమః

ధైర్య స్వరూపిణియై భాసిల్లునట్టి మాతకు వందనాలు.


447. ఓం శాంత్త్యై నమః

సాంసారిక బాధలను దూరంచేసి శాంతిని ప్రసాదించునట్టి మాతకు ప్రణామాలు.


448. ఓం స్వస్తిమత్త్యై నమః

శుభప్రదమైన మాతకు నమస్కారాలు.


449. ఓం కాంత్యై నమః

కాంతి స్వరూపమైన ఆ తల్లికి వందనాలు.


450. ఓం నందిన్యై నమః

సర్వులనూ విశేషంగా భక్తజనులను ఆనందింపజేయునట్టి మాతకు ప్రణామాలు.


451. ఓం విఘ్ననాశిన్యై నమః

విఘ్నాలను-- అన్నింటినీ నాశనం చేసి భక్తజనులు మార్గాన్ని నిష్కంటకంగా ఉంచునట్టి దయామయికి కైమోడ్పులు.


452. ఓం తేజోవత్యై నమః

జగత్తుకు ప్రకాశాన్ని ప్రసాదించు సూర్యచంద్రాగ్ని తేజోమూర్తులకు సైతం తేజస్సును ప్రసాదించి స్వతేజంతో ప్రకాశించునట్టి మాతకు వందనాలు.


453. ఓం త్రినయనాయై నమః

సూర్య చంద్రాగ్నులే త్రినేత్రాలుగా గల ‘త్రినయన’ కు వందనాలు.


454. ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః

కామస్వరూపిణియై అంటే సర్వకామప్రదాయై సుందర విశాల నయనాలతో భాసిల్లు మాతకు ప్రణామాలు.


455. ఓం మాలిన్యై నమః

కన్యా స్వరూపిణి (సప్తవర్ష ప్రాయయగు కన్యను-- మాలిని అంటారు.)కి వందనాలు.


456. ఓం హంసిన్యై నమః

పరమహంస ‌స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులు న్నాయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యాసికి ‘హంస’ అని పేరు. అట్టి పరమహంసకు--పరమేశ్వరికి అభేదము.


457. ఓం మాతాయై నమః

యావద్విశ్వానికీ మాతృ స్వరూపిణియైన మాతృమూర్తికి వందనాలు.


458. ఓం మలయాచల వాసిన్యై నమః

మలయపర్వతం వాస స్థానం గల తల్లికి ప్రణామాలు.


459. ఓం సుముఖ్యై నమః

అంగీకరించదగిన సుందరి ముఖం కలిగిన తల్లికి వందనాలు.


460. ఓం నళిన్యై నమః

సర్వజనులను ఆకర్షించునట్టి పద్మ సదృశ సుందరమూర్తికి ప్రణామాలు.


461. ఓం సుభ్రువే నమః

సుందరమైన కనుబొమలు కల దేవికి నమస్కారాలు.


462. ఓం శోభనాయై నమః

శుభప్రదమైన దివ్యమంగళమూర్తికి వందనాలు.


463. ఓం సురనాయికాయై నమః

దేవతలందరికీ నాయికురాలైన మహాశక్తికి వందనాలు.


464. ఓం కాలకంఠ్యై నమః

నల్లని కంఠభాగము కల మాతకు వందనాలు.


465. ఓం కాంతిమత్యై నమః

విశేష కాంతులతో ప్రకాశించునది- జ్ఞానప్రకాశంతో భాసిల్లునట్టి దేవికి వందనాలు.


466. ఓం క్షోభిణ్యై నమః

లయవేళలో క్షోభిణీమూర్తిని దాల్చు తల్లికి ప్రణామాలు.


467. ఓం సూక్ష్మరూపిణ్యై నమః

గ్రహించ వీలుకాని అత్యంత సూక్ష్మస్వరూపిణికి ప్రణామాలు.


468. ఓం వజ్రేశ్వర్యై నమః

జాలంధరీ పీఠంలో షష్ఠీ తిధి నిత్యం దేవతయగు వజ్రేశ్వరీ శక్తిరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి వందనాలు.


469. ఓం వామదేవ్యై నమః

వామదేవుడనగా శివుడు వామదేవుని పత్ని కావున వామదేవి అట్టి జననికి వందనాలు.


470. ఓం వయోవస్థా వివర్జితాయై నమః

అవస్థా త్రయాతీతురాలు వయస్సుకు అతీతరూపిణి అయిన మాతకు వందనాలు.


471. ఓం సిద్ధేశ్వర్యై నమః

దేవతా గణాలలో ఒక గణమైన సిద్ధులకు నాయికయైన లేదా అష్టసిద్ధులకూ అధీశ్వరియైన సిద్ధేశ్వరికి వందనాలు.


472. ఓం సిద్ధవిద్యాయై నమః

సిద్ధులను ప్రసాదించునట్టి విద్యాస్వరూపిణికి వందనాలు.


473. ఓం సిద్ధమాతాయై నమః

సిద్ధులన్నింటికి మాతృస్వరూపురాలైన తల్లికి వందనాలు.


474. ఓం యశస్విన్యై నమః

కీర్తి స్వరూపిణికి ప్రణామాలు.


* * * ద్వాదశ అధ్యాయం సమాప్తం * * *


----సశేషం----

Posted in June 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!