Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ద్వాదశ అధ్యాయం (మంత్ర విద్య, సిద్ధ విద్య స్వరూప అమ్మవారు)

శ్లోకాలు: 87-97, సహస్రనామాలు: 401-474

415. ఓం మనోవాచామ గోచరాయై నమః

మనస్సుకు, వాక్కుకు గోచరించనిది, అందనిదియై అతీత స్వరూపిణికి వందనాలు.


416. ఓం చిచ్ఛక్యై నమః

అజ్ఞానాన్ని దూరం చేయగల విద్యకు చైతన్యమని పేరు, ఆ చైతన్యానికే చిచ్ఛక్తి నామం ఉంది. అట్టి చిచ్ఛక్తి స్వరూపిణికి ప్రణామాలు.


417. ఓం చేతనారూపాయై నమః

చైతన్య స్వరూపిణియై తేజరిల్లు జగదంబకు వందనాలు.


418. ఓం జడశక్త్యై నమః

బ్రహ్మశక్తి ద్వారా ప్రభవించునట్టి జడసృష్టి స్వరూపిణికి ప్రణామాలు.


419. ఓం జడాత్మికాయై నమః

కంటికి కనిపించునట్టి నామరూపాత్మకమైన జడసృష్టి ఆత్మగా గల తల్లికి వందనాలు.


420. ఓం గాయత్ర్యై నమః

గానం చేయువారిని తరింపజేయునది గాయత్రి, వేదజననియు గాయత్రి. అట్టి గాయత్రీ స్వరూపిణికి ప్రణామాలు.


421. ఓం వ్యాహృత్యై నమః

విశేష మంత్రరూపము గల వ్యాహృత స్వరూపిణికి వందనాలు.


422. ఓం సంధ్యాయై నమః

సూర్య సంబంధిత బ్రహ్మ పదార్ధ విశేషాన్ని కి ‘సంధ్య’ అని నామము. సంధికాలంలో అంటే ఉదయ, మధ్యాహ్న సాయంకాలాలలో సంధి వేళలో ఉపాసింపదగిన సంధ్యాస్వరూపిణికి వందనాలు.


423. ఓం ద్విజబృంద నిషేవితాయై నమః

ద్విజపరివారాలచే ఆరాధించబడునట్టి లేదా సేవింపబడునట్టి తల్లికి వందనాలు.


424. ఓం తత్త్వాసనాయ నమః

తత్త్వనామకమైన యోగపీఠమే ఆసనంగా కలిగిన తల్లికి వందనాలు.


425. ఓం( తత్వమయీ=తత్+ తుభ్య+ అయ్యై) తస్మై నమః

సర్వుల మనోబుద్ధులలో సంచరించునట్టి తల్లికి నమస్కారాలు.


426. ఓం తుభ్యం నమః

పరమేశ్వరివైన తల్లీ నీకు వందనాలు.


427. ఓం అయ్యై నమః

సర్వులకూ మాతృ స్వరూపిణియై భాసిల్లు మహాదేవికి వందనాలు.


428. ఓం పంచకోశాంతరస్థితాయై నమః

అన్నమయ, ప్రాపుమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ నామకమైనా పంచకోశాంతరాలతో తేజరిల్లునట్టి సర్వశక్తి స్వరూపిణికి ప్రణామాలు.


429. ఓం నిస్సీమ మహిమాయై నమః

హద్దులు లేని అంటే అపారమై మనోవాగతీతమైన మహిమలుకల తల్లికి వందనాలు.


430. ఓం నిత్యయౌవ్వనాయై నమః

సర్వవేళలా, సర్వకాలాలలో సదాసర్వదా యౌవనమూర్తిగా ఉండునట్టి మాతకు ప్రణామాలు.


431. ఓం మదశాలిన్యై నమః

ఆనందోత్సాహాలతో భాసిల్లునట్టి మాతకు ప్రణామాలు.


432. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః

మదంవల్ల ఘూర్ణించగా ఎర్రవారిన నేత్రాలు కల మాతకు నమస్కారాలు.


433. ఓం మదపాటలగండభువే నమః

కస్తూరి, పాటలాలతో చిత్రించబడడంవల్ల ఎరుపు తెలుపు రంగులలో ప్రకాశించుచున్న గండస్థ కల తల్లికి వందనాలు.


434. ఓం చందనద్రవ దిగ్ధాంగ్యై నమః

చందన ద్రవంచే లేపితమైన దివ్యాంగాలు కల మాతకు వందనాలు.


435. ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః

చాంపేయ పుష్పాలయందు విశేషమైన ప్రీతిగల మాతకు వందనాలు.


436. ఓం కుశలాయై నమః

సృజన కార్యంలో చాతుర్యం-- కౌశల్యం కల జననికి నమస్కారాలు.


437. ఓం కోమలాకారాయై నమః

సుకోమలమైన రూపం కల తల్లికి వందనాలు.


438. ఓం కురుకుళ్ళాయై నమః

శ్రీ చక్రంలో తేజరిల్లునట్టి కురుకుళ్ళాదేవీ స్వరూపిణి అయిన మాతకు ప్రణామాలు.


439. ఓం కుళేశ్వర్యై నమః

సజాతీయమైన మాతృకాబృందానికి కుళమని నామమున్నది. అట్టి బృందానికి అధీశ్వరీ అయిన జగజ్జననికి వందనాలు.


440. ఓం కుళకుండలయాయై నమః

మూలాధారంలో స్థిరమైయుండు కులకుండము నివాసస్థానంగా గల తల్లికి ప్రణామాలు.


441. ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః

కౌళమార్గంలో తత్పరులైన వారిచే విశేషంగా సేవింపబడు మాతకు ప్రణామాలు.

----సశేషం----

Posted in May 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!