Menu Close
Kadambam Page Title
mother and baby
సాటిలేని మహిళ
“ఉదయశ్రీ” యు.సి.ఓబులేశు గౌడు

జగతిలో స్త్రీ పాత్ర సాటిలేనిది
అమ్మగా అక్కగా చెల్లిగా ఆలిగా
ఎన్నిపాత్రలలోనైననూ జీవిస్తుంది
ఆమె లేనిదే మగజాతి మనలేదు
అసలు ఈ జగతికి మనుగడే లేదు
ఎన్ని యుగాల చరిత్ర చదివిననూ
అన్ని ఘటనలకూ ఆమెది కేంద్రస్థానం
ఆమెయే లేక సాగలేదు నాందీప్రస్థానం
ఎంతటి మహనీయుల జననమ్ముకైననూ
ఆమెది మాతృస్థానం, అమృతక్షీరపానం
ఎవ్వరికైననూ ఆమెయే మొదటి గురువు
బంగరు భవితకు తెరువు ఆమే ఆదరువు
అక్కగా చెల్లిగా ఆదరించి అభిమానిస్తుంది
ఆలిగా అలరిస్తుంది పతిసేవలో తరిస్తుంది
మగని అంశను వంశమును నిలబెడుతుంది
కట్టె కాలే దాకా మగడికి అండగా నిలుస్తుంది
పతి ముందే తన ఊపిరి ఆగాలనుకుంటుంది
తను సుమంగలిగా దివికేగి సాగాలనుకుంటుంది

మాతృదినోత్సవ శుభాకాంక్షలు

Posted in May 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!