Menu Close
mg
Song

అమ్మా అవని

సహనానికి, కర్తవ్య నిర్వహణకు, కుటుంబ బరువు బాధ్యతల స్వీకరణలో మహిళామూర్తి ని మించిన వ్యక్తి లేరు. కనుకనే ఆమెను భూమాత తో పోల్చి చూపించడం జరుగుతుంది. భూదేవి, అవని, ధాత్రి, ధరిత్రి, భూమి, భువి,పృథ్వి, సురభి, స్థగణ..ఇలా సకల జీవరాశికి నిలువ నేలను కల్పించిన భూమాత ను ఎంత స్తుతించిననూ తృప్తి కలగదు. ఈ మాతృదినోత్సవ సమయాన ఆ నేలతల్లిని ఒకసారి గుర్తుచేసుకునేందుకు వీలుగా విరచించి చిత్రీకరించిన ఈ మధురమైన పాటను మీ అందరికోసం అందిస్తున్నాము.

ఈ గీతాన్ని చిత్రం కొరకు శ్రీమతి మాళవిక ఆలపించగా, మన సిరిమల్లె కోసం చి. చైత్రిక బుడమగుంట తన స్వరంలో వీనులవిందుగా గానం చేసింది. మీరు కూడా ఆ గుబాళింపుని ఆస్వాదించండి.

movie

రాజన్న (2011)

music

శివ శక్తి దత్త

music

ఎం.ఎం.కీరవాణి

microphone

మాళవిక

అమ్మా ఆఆ ఆఆ అవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

కనిపెంచిన ఒడిలోనే కన్ను మూయని
మల్లి ఈ గుడిలోనే కళ్ళు తెరవని
అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని

తల్లి నిను తాకితేనే తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణా కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్న

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మ అవనీ...

నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాధలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది

రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగరిసదపదస
రిగగ రిపపప గదదద పదదద

సద సద పగ పద సద సద సద సద
పద సద పద సద పద సద పద సద

సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగ రిస రిగ రిస రిగ రిస రిగ రిస
సరి సరి గారిస గారిస గారిస
రిగ రిగ పా గరి సద పా

గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ పా
సరిగ పదస రిగ పా
గప గరి సరి సద వీర మాతవమ్మ
రణ ధీర చరితవమ్మా
పుణ్య భూమివమ్మా నువ్వు ధన్య చరితవమ్మా

తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకె గలదేదమ్మ

అమ్మా అవని నేలతల్లి అని
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకని
అమ్మా...అవనీ...

Posted in May 2023, పాటలు