Menu Close
Kadambam Page Title
నేనొంటరిని
యిరువంటి శ్రీనివాస రావు

నేనొంటరిని....
ఆలోచనలు పంచుకోలేని
ఆశయాలను తెంచుకోలేని
యత్నాలను విరమించలేక
ఫలితాలతో సంబంధం లేక జీవిస్తున్న నేనొంటరిని

సాలెగూటిలో పురుగులా
సమస్యల వలయంలో
బడబాగ్ని జీవన ప్రళయంలో
ఏమీ చేయలేని చేతగాని ఎవ్వరినీ ఏమీ అనలేక జీవిస్తున్న నేనొంటరిని

క్షణక్షణం ఆవేదనతో
చావు రాక బ్రతకలేక
ఎందరున్నా ఎవ్వరూ లేని
నేనున్నా నేను కాని ఇపుడున్నా ఏమీ లేని నేనొంటరిని

గడచిన కాలం గాయం మాననిదిగా
వర్తమానం చేదుగా
భవిష్యత్తు అంధకారంగా
ఆద్యంతం జీవచ్ఛవం లా జీవిస్తున్న నేనొంటరిని.

దూరం కానక తీరం తెలియక
గమ్యం తెలియని బాటసారిలా
అంతం లేని జీవధారలా
ఈ జీవన పయనం సాగిస్తున్న నేనొంటరిని.

ఏడ్చి ఏడ్చి ఏడవ లేక
నవ్వే తెలియని ఈ నిర్దర జీవనయానంలో
నిరర్ధక యానం చేస్తున్న నేనొంటరిని

నీడ కూడా తోడులేని
నన్ను నేనే నమ్మలేని
దాహమైనా వెయ్యలేని ఈ జీవన ఎడారిలో
జాడ తెలియని ఒయాసిస్సు వెతుకుతున్న నేనొంటరిని

నీట రాసిన రాతలల్లే
సంద్రపు ఘోషలల్లే
అడవిలో ఆర్తనాదాలల్లే
కొఱగాని నా జీవనగమనంలో నేనొంటరిని

ప్రేమ లేక స్నేహం లేక
విశ్రాంతి లేక అలుపేరాక
ఒంటరి యుద్ధం లో గెలుపే రాక
అయోమయపు జీవితం సాగిస్తున్న నేనొంటరిని

ఎప్పటికయినా ఎన్నటికయినా
ఎవ్వరైనా జత కలవక పోతారా అని
నిస్సహాయంగా వేచిచూస్తున్న
నేనొంటరిని ఎప్పటికీ నేనొంటరినే

Posted in August 2023, కవితలు

6 Comments

  1. A.Vital prasad

    చాల బావుంది, మీ లో ఒక కొత్త శ్రీనివాస్ నీ చూస్తున్న
    నమస్తే

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!