Menu Close
సిరిమల్లెబాలకు విరుల జేజేలు
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
కం.
అష్టమవసంత మియ్యది
శిష్టపదాహ్లాదకేళిచే ముత్ప్రదయై
పుష్టికి, స్పష్టతకు వి
శిష్టత గడియించినట్టి చిన్నారి కదా
కం.
సిరిమల్లెబాల నవ్విన
సిరిసిరిమువ్వల రవాలు చేరును శ్రుతులన్
మురిపెంబు లొలికి శుభకర
కరదీపిక యగుచు నెదిగి కాంచుత ప్రగతిన్!
చం.
గురుతమప్రాజ్ఞు లెందఱికొ కోటివిధంబుల ముద్దుబిడ్డ యీ
సిరులకొటారు, మల్లెవలె చేతము లుల్లసిలంగ సౌరభా
లరుదగు సాహితీగరిమ నందఱికిన్ వెదజల్ల మాటలే
దొరలెడు ముత్యరాశి యగు, దోసిలి పట్టగ పాఠకాగ్రణుల్
కం.
దేవతలే దీవించెద
రీ వైశిష్ట్యంపునిధిని హృదయంగమయై
ఆవిర్భవించు పరిపరి
ఏ వేదికనైన సర్వ మీశ్వరుకృపయే
కం.
బాలకు వినయాదికగుణ
జాలకు సువిశాలభావజాలకు సుమనో
లీలకు సత్సంగాప్తసు
శీలకు ఆశీస్సుమాభిషేకం బిదియే
Posted in August 2023, సాహిత్యం, సిరిమల్లె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *