Menu Close
సంపాదకుల సంతోషకర సందర్భ వాచకం

మాతృభాష మాధుర్యానికి ముగ్డుడనై
తేనెలొలుకు తెలుగు మమకార బద్దుడనై
సాహితీ సౌరభాల గుబాళింపులకు సమ్మోహితుడనై
అమ్మ నుడికి ఆనందకర ఆత్మబాంధవుడనై

అక్షరజ్ఞానం అట్టడుగున ఉన్ననూ
అ,ఆ అంటూ అక్షరాల అమరికను అవపోసన పడుతూ
భయ భక్తులతో బాల్యంలో నేర్చుకొన్న
విభక్తులను వితరణతో మననం చేసుకుంటూ

ఆశతో, ఆశయాల ఆచరణ శుద్ధితో
భావితరాలకు బాధ్యతగా అందించాలని
సిరిమల్లె సాహితీ సేవలో తరిస్తూ
నేటికి ఎనిమిది వసంతాలు!!!

సాహితీ ప్రియులందరి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉన్నంతవరకు మన సిరిమల్లె ఇలాగే అప్రహితంగా నిత్య సాహితీ విరుల సువాసనలతో విలసిల్లుతుంది. మరెన్నో వసంతాలను నిత్యనూతన సాహితీ సౌరభాల సాక్షిగా జరుపుకుంటూ సిరిమల్లె పాఠకులను అలరిస్తుందనీ, అందుకు మా వంతు కృషిని నిరంతరం బాధ్యతతో నిర్వహించి అందరినీ అలరించే విధంగా ప్రతి సంచికనూ తీర్చిదిద్దుతామని ఈ శుభ తరుణంలో మనవిజేస్తున్నాము.

- నమస్కారములతో
మధు-ప్రియ బుడమగుంట

Posted in August 2023, సంపాదకీయం, సిరిమల్లె

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *