సాహితీసిరిమల్లె
బుడమగుంట వారి ఇంటి పాదులో ఊపిరిగొని
ఉమామధుల చల్లని చేయూతలో నడకలు నేర్చి
ఎనిమిది వసంతాలు పూరించిన సిరిమల్లె బాల
కవితాసుగంధాలు వెదజల్లుచున్న సాహితీమాల
తేనెతెలుగు భాషాతేజము అంతర్జాలములో సైతం
సుప్రభాతకాంతిలా దశదిశలా విస్తరిస్తున్న వైనం
ప్రతి తెలుగు ప్రియభాషాహృదికిదేగా గర్వకారణం
భాషాప్రియులెల్లరికి తెలుగు కళామతల్లి ఆరాధ్యదైవం
ఆ అమ్మతనం కమ్మదనాన్ని అక్షరీకరించిన తరుణం
గిడుగు వీరేశలింగం బాటలో చరించిన శుభసమయం
ఈ సాహితీసుందరోద్యానవనం కాదా!సతతహరితం
తెలుగు భాషోద్యమం మరొక్కమారు కాదా! అప్రతిహతం