కదంబం - సాహిత్యకుసుమం
పుణ్య భూమి నాదేశం
– డి. షాహినా –
పవిత్ర గంగాజల సంగమ క్షేత్రం...
మహామహులను కన్న పుణ్య ప్రదేశం...
ధీర పుణ్య చరిత ఉన్న భారతదేశం...
అన్నపూర్ణగా విలసిల్లిన నాదేశం...
భారతదేశం నా జన్మ ప్రదేశం...
ఉత్తరాన అనంతమైన హిమగిరి శిఖరం...
దక్షిణాన మూడు సాగరాల కలయిక మహోన్నతం..
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుని స్మారక చిహ్నం...
అమరజవాన్ జ్యోతి ప్రకాశం అనునిత్యం...
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న దేశం...
రత్న గర్భగా పేరు గన్నది హిందూ దేశం...
సత్యాహింసలకు నిలయమైన పుణ్య భూమి నాదేశం...
బుద్ధుడు మహమ్మద్ ఈసా నడయాడిన ప్రదేశం...
భారత ఖండం ఒక అమృత భాండాగారం...
అశోకుడు ఏలిన ఈ ధర్మ ప్రదేశం...
అంతరిక్షాన అడుగుపెట్టిన అద్భుతం...
సంస్కృతి సాంప్రదాయాలకు ఆశ్రయం...
శిల్ప సంపదకు ప్రకృతి పచ్చదనానికి ప్రాధాన్యం...
దేశ సమైక్యతకు సౌబ్రాతృత్వానికి మేరా భారత్ మహాన్...
********
32