సిరిమల్లె పాఠకులందరికీ నమస్కారములు. మన ఆరోగ్యం మన చేతిలో .. Our health in our hands... అనే శీర్షిక మొదలుపెట్టి నేటికి నాలుగు సంవత్సరాలు గడిచింది. అనూహ్య స్పందనతో మనసుకు ఎంతో ఆత్మ ఆత్మసంతృప్తి కలిగింది. అయితే ఈ శీర్షిక కేవలం తెలుగు భాష చదవడం తెలిసిన వారికి దగ్గరైంది. మరి తెలుగు మాట్లాడుతూ, అర్థం చేసుకునే ఎంతోమంది పాఠకులకు ఈ శీర్షిక లోని విషయాలు బోధపడటం లేదు. అటువంటి వారి వద్ద నుండి వచ్చిన అభ్యర్ధన మేరకు ఈ మన ఆరోగ్యం మన చేతిలో శీర్షికను, మన సిరిమల్లె ఎనిమిదవ వార్షిక సంచిక నుండి ఆడియో రూపంలో కూడా తీసుకొని వస్తున్నాము.
Dear Sirimalle readers, namaste! A Note about ‘Our health in our Hands… Column’ audio launching:
We are proud and glad to say that we got tremendous response from readers about this column. Thank you everyone for your wonderful encouragement and response. Now we are happy to announce that this column is now coming in audio form also so that it can reach more people who can understand Telugu but cannot read. That way the main purpose that motivated me to write this article will be fulfilled in much better way. You can find the audio clips (from part 1 and slowly adding more soon).
ఈ శీర్షిక మొదటి భాగం నుండి ఆడియో క్లిప్స్ చేసి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీకు అందిస్తున్నాము. నెమ్మదిగా మిగిలిన భాగాల ఆడియో కూడా ఈ పేజిలో చేరుస్తాము. దయచేసి గమనించండి.
Please find the audio segment for the first part of Our Health in Our Hands (మన ఆరోగ్యం మన చేతిలో). We will add more audio links on this page as they are recorded. Stay tuned!!
ఆడియో పేజి లింక్ : మన ఆరోగ్యం మన చేతిలో Audio | Our Health in Our Hands Audio »
– Regards, Madhu Budamagunta.
ఆచారాలు-ఆచరణీయ వాస్తవ దృక్పధాలు 4
నేడు మనం ఆచరిస్తున్న అన్ని ఆచారాలు ధర్మ బద్ధమైనవే. కాకుంటే వాటిని కొంతమంది తమ స్వప్రయోజనాల కొరకు వాటిలో మార్పులు చేయడం జరిగి కొన్ని ఆచారాలు సరైన విశ్లేషణను చూపలేక మనం గుడ్డిగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. కానీ, ప్రతి సంప్రదాయానికి ఒక శాస్త్రీయమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకొని పాటించినప్పుడు ఎటువంటి సందేహాలకు తావు ఉండదు.
ఉదాహరణకు ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటిపేరు ఉన్నవారికి పది రోజులు అంటు అని చెప్పి ఎవరినీ కలువకూడదు అని నిబంధన ఉంది. అలాగే దహన సంస్కారాల తరువాత తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని కడిగి పసుపు నీళ్ళతో శుభ్రం చేయాలి. అందుకు కారణం... ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు రోగసంబంధ క్రిముల ప్రభావం పూర్తిగా తొలగి ఇతరులకు వ్యాపించకుండా ఉండాలని ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. సాధారణ మరణమైననూ, చనిపోయిన తరువాత అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అది సమాజానికి వ్యాప్తి కాకూడనే దేవాలయాలు, ఇతర జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదనే పద్ధతి పెట్టడం జరిగింది. గత మూడు సంవత్సరాలు కరోనా మహమ్మారి పుణ్యమా అని ఆ నిబంధనను isolation అని, quarantine అని మనందరం చవిచూడడం జరిగింది. అలాగే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి ఇంకా ఏర్పడదు కనుక బయటి వాళ్ళు ఎవ్వరూ తల్లి బిడ్డ ఉన్న గదికి వెళ్లకూడదని, బాలింతను తాకకూదడనే నిబంధన కూడా ఉంది. అన్ని ప్రార్థనా మందిరాలలో గంటలు ఎందుకు ఉంటాయి. వాటి వలన ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తే గంట కొడితే దేవుడు మేల్కొంటారు అని అంటారు. వాస్తవానికి ఆ అతీత శక్తివంతమైన బ్రహ్మ పదార్ధం అంతటా నిండి ఉంది. మనం నిద్ర పోయేటప్పుడు కూడా ఆ శక్తి మేల్కొని ఉండి మనం తిరిగి మెలుకువలోకి వచ్చేందుకు సహాయం చేస్తుంది. కనుక దేవునికి నిద్ర, ఆహారం, జీవము, నిర్జీవము, సమయము, స్థలము అనే విషయాలు వర్తించవు.
జీవితంలో అన్ని విషయాలను గురించి తెలుసుకోవడం అవసరం అయితే అదే పనిగా ఆ విషయాల గురించి భయపడుతూ, భయపెడుతూ ఉండవలసిన అవసరం లేదు. దానివలన మానసిక అస్థిరత ఏర్పడే అవకాశం మెండుగా ఉంటుంది. తద్వారా సరైన సమయంలో మెదడు సరైన రీతిలో స్పందించడం జరగదు. విషయాలను సంగ్రహించే సమయంలో విచక్షణతో సరిగా అర్థం చేసుకొని తదనుగుణంగా అది మన జీవితానికి ఏ విధంగా మంచి చేయగలుతుందో తెలుసుకుని సరైన రీతిలో అవసరమైతే మార్పులు చేసుకుని అన్వయించుకోవచ్చు. అంతేగానీ గుడ్డిగా భయంతో మన జీవన విధానానికి, ఆలోచనా సరళికి సరిపోకున్ననూ పాటించడం మొదలుపెడితే అది ఎక్కువ కాలం స్థిరంగా క్రమం తప్పక పాటించడం జరగదు. దానికి తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది. ఆ చిన్ని లాజిక్ మిస్ అయినరోజు ఎదుటివారిని నిందించడం తప్ప మరో ఆలోచన మనకు కలగదు. ఆవేశంతో హడావుడిగా అస్తవ్యస్తంగా హమ్మయ్య అయిపొయింది అనే భావనతో చేసే ఏ పని, కార్యం అయినా సరైన ఫలితాలను ఇవ్వదు. అలా కాకుండా మనసుకు నచ్చి నిదానంగా క్రమం తప్పక ఒక విధానంతో చేసే ఏ కార్యమైనా తప్పక ఫలితాలను సిద్ద్ధింప జేస్తుంది. ఇక మంచి చెడు అనేది ఒక ప్రామాణికం మాత్రమె. అది సమయాన్ని బట్టి, పరిస్టితులను బట్టి మారడం జరుగుతుంది. అది అర్థం చేసుకొని మనం చేయవలసిన కర్తవ్య నిర్వహణను చక్కగా పాటించి తదుపరి సహనంతో వేచి చూడాలి అంతేకాని అనవసరమైన మానసిక వత్తిడులకు లోనైనందున ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా రుచి చూస్తాము.
‘సర్వే జనః సుఖినోభవంతు’