“సిరిమల్లె అంతర్జాల పత్రికకు ఎనిమిది వసంతాల వార్షిక శుభాకాంక్షలు”
మనిషిలోని మానవుడు
చుట్టూ వున్న మనుష్యుల్ని నీ మనసనే కంటితో చూడు
మనిషికీ మనిషికీ మధ్య వున్న మానవత్వం కనపడుతుంది
ఈ సమాజంలో అవిటితనంతో అవకాశాలు లేని వారెందరో వున్నారు
అన్నీ వున్న నీ అదృష్టాన్ని అలాటి ఆ మిత్రులతో పంచుకో
ఒక గుడ్డివాడి జీవితాన్ని అంతర్గతంగా చూడాలంటే
ఒక రోజంతా కళ్ళు మూసుకుని నీ పనులు చేసి చూడు
ఒక చెవిటివాడి నిశ్శబ్ద జీవన సంగీతాన్ని వినాలంటే
ఒక రోజంతా ఏమీ వినపడకుండా చెవులు మూసుకుని విను
అప్పుడర్థమవుతుంది మనం విస్మరిస్తున్నది ఏమిటో
ఆ గుడ్డితనం, చెవిటితనం, అవిటితనం వారివో మనవో
తోటి మనుష్యుల్ని మనుష్యులుగా చూడటానికి భగవద్గీత ఆఖ్కర్లేదు
మానవత్వపు కళ్ళతో చుట్టూ చూస్తే నువ్వే భగవంతుడివవుతావు