ఏ భాషలోనూ లేని సునిశిత పదప్రయోగాలు మన తెలుగుకు మాత్రమే సొంతం. ఒక గుణింతం మార్పుతో అర్థాలను మార్చి మరింత భావయుక్తంగా వ్రాయడం అనేది తెలుగు భాషాప్రియులకు అత్యంత ఇష్టమైన అంశం. మనసుకు హత్తుకునే భావపూరిత పదజాలంతో చక్కటి గీతాలను సృష్టించగలిగిన గేయ రచయితలు మన తెలుగు చలనచిత్ర రంగంలో ఉండడం మన అదృష్టం. అటువంటి అద్భుత ప్రతిభాశాలి, తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిన ఈ గేయం, ఎ.ఆర్.రహ్మాన్ గారి స్వరకల్పనలో మరింత మాధుర్యాన్ని సంతరించుకొని వినేవారి చెవులకు నిజంగా మనోల్లాస సంగీత మాధుర్యాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. హరిహరన్, చిత్ర గార్లు ఆలపించిన ఈ పాటను ఇప్పుడు చిరంజీవి ప్రతీక బుడమగుంట గళంలో విందాం.
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లు కావా
పిలుపే అందుకొని బదులే తెలుపుకొని
కౌగిట ఒదిగి ఉండనీవా..
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లె పూల మాలైనిన్నే వరించి పూజించే వేళా
నిరీక్షించి స్నేహం కోరి , జతనై రానా ...రానా...
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట..
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా..వా...
పూవై నవ్వులని తేనై మాధురిని
పంచే పాట మన ప్రేమ
విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమ
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా, ఒక్క క్షణమై క్షణమై
నువ్వూ నేను చేరి సగమౌదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం
తుదే లేని ఆనందం వేచేనే నీకోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదటనె కలవా
దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే .....రా.....