వేయి కన్నులతో
తెలుగు భాష అక్షర సిరులతో మాధుర్య ప్రధానమైన సంగీత స్వరాలతో చిత్రీకరించిన కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలైనా మనసులో అలాగే నిక్షిప్తమై, పాటను వింటున్నప్పుడు ఎప్పుడైననూ మన ప్రమేయం లేకుండానే ఆ పాటను మనం కూడా పాడుకుంటూ జత కలుపుతాము. అటువంటి పాటలు ఎన్నో మనకు మన తెలుగు చిత్ర సీమ అందించింది. అందుకు కృషి చేసిన గేయ రచయితలు, అద్భుతమైన స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు, పాడిన గాయనీగాయకులు, చిత్రీకరించిన దర్శకులు అందరికీ మనఃపూర్వక జోహార్లు.
చిత్రం: నీ స్నేహం; గాత్రం: ఉష, ఆర్.పి. పట్నాయక్;
గేయ రచన: కులశేఖర్; స్వరకల్పన: ఆర్.పి. పట్నాయక్
ఈ వీనులవిందయిన పాటని ఇక్కడ వినవచ్చు →
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా
ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్..ఒకసారి ల ల ల
ఒక్కసారి అయినా చేయి అందించి
ఈ వింత దూరాన్ని కరిగించుమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతు లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా