Menu Close
తోటలో పూలు, ఇంటిలో పిల్లి
– అయ్యగారి సూర్యనారాయణమూర్తి –
Madhupriya-Garden
మ.కో. మేము మేమని పల్కరింపఁగ మీఁదమీఁదకు వచ్చి పై
          స్వామి పంపిన దూతలో యన సందు సుంతయు వీడ కు
          ద్దామప్రేమను జూడ నిల్చిన ధర్మమూర్తులె యీ సుమా
          లేమి పున్నెము సేసిరో మఱి యింత భాగ్యము నొందఁగా?

చం. బుజములు రాచుకొంచుఁ బరిపూర్ణముదావహు లౌచు ఫుల్లమౌ
       నిజవదనంబులన్ గనుచు నిత్యము మీ గృహవాటి(1) నిల్వఁ నీ
       రజభవహర్షమే(2) గలిగి రాజిలఁ జేయరె పూలబాల లా
       సృజనకు మీ కృతఙ్ఞతల నెవ్విధిఁ నిర్వురుఁ దెల్పువారలో?
                  (1) పెరటి తోట (2) బ్రహ్మానందము
Anu-Pet-Cat
కం. ‘అను’నామధేయమును గొని
       యనుదిన మానందపఱచు నట్టి బిడాలం
       బునుఁగనఁ గనువిం దగును శ్ర
       వణనయనయుగాలు చాలు బంధింప మదిన్

మ.కో. భాష వచ్చిన ముద్దుముద్దుగఁ బల్కరించును గాదె సం
          భాషణాకృతిఁ దాల్చి తత్ప్రియభావముల్ మధుగారికిన్
          యోషయౌ ఉమగారికిన్ గిరణోదయాస్తమయంబు లం
          దీషదాప్తము గాఁగ(1) నంతర(2) మిట్టె భారము దూరమౌ
                    (1) కొంచెము లభించిన (2) సమయము
Posted in May 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *