Menu Close
Samudraala Harikrishna
చిత్ర వ్యాఖ్య
-- సముద్రాల హరికృష్ణ --
Ganesha-Statue

వరదాత!

పాల గణపతి, ఆ అగజ మురిపాల శిశువిది
తలలు పదింటికి పాఠము గఱపిన గడుసిది
బల్సరసముగ దంత లేఖిని వాడిన కరమిది
మ్రోల వేడిన,వర తీర్థమిడు కలశమ్మిదియున్!

Green-Bananas

మారుతీ వాసం!!

ఏటి చూడవేటి,అటు ఇటు చూసిన,పచ్చని అరటి!
మేటి,రాములోరి బత్తులలో,ఆ మారుతిట,లేకేమిటి?!

Vintage-Radio

ఆకాశవాణి!

భక్తి భావోదయములుగ నలరించు భక్తి రంజని
ఎక్కడి వార్తల ఢంకా బజాయించెడి వార్తా స్రవంతి
చక్కని మ్రృదు భావనల లలిత సంగీత లహరి
చిక్కని పట్టులౌ నాటికల వాచిక కళా మహతి

{ii}

అదియె మిత్రము,గురువు, వినోదమైన సాధనము
ఇదియె స్నేహార్ద్రాంజలి అద్భుత స్వరమంజూషకున్!!

Marble-Statue

ఎవరో?!

వలిపెమున దాగిన శిల్పసుందరిని చేసె,/
పాల రాతికె ప్రాణము పోసి,ఒక నేర్పరి!/
ఇలను చూసినదీ రూపున వెలు వడెనో/
కలలో కనిపించిన దాని తీరిదో, చెపుమా!!

Posted in August 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!