తెలుగు దోహాలు
- నీరు భద్రముగ వాడుకుని, జల యుద్ధం తప్పించు,
పరిశుభ్రతను పాటించిన, రోగాలను వారించు! - ఆడపిల్ల పుట్టినపుడే, ఒక అమ్మ పుట్టినట్లు,
అబద్ధాలు పలికినపుడే, సత్యము మరుగైనట్లు! - ఇతరుల సొమ్ము కోరితివా, నీడై తరుము అశాంతి,
ఉన్నదానితో గడుపుకో, బ్రతుకున నిలుచు శాంతి! - అలసత్వము చూపించితే, అధములలో నిలిచేవు,
చురుకుదనాన్ని చూపితివా, కార్యము సాధించేవు! - ఆపన్నులను కాచేవా, దైవము తోడు నిలుచును,
భయపడి వెనుకడుగు వేస్తే, విజయము విడిచి పోవును! - ఆత్మబలము కలిగి ఉంటే, విజయము తప్పక కలుగు,
ఈర్ష్యా, అసూయ పనిపితే బ్రతుకు శోకాన మునుగు! - గురువుల బోధన పాటిస్తే, భవిత బంగారమగును,
పలుకులు మృదువుగ పలికితే, స్నేహభావము కలుగును. - కన్నవారిని ప్రేమిస్తే, దైవ కృపను పొందేవు,
మంచివారిని దూషిస్తే, చిక్కులు ఎదుర్కొనేవు! - ప్రకృతిని రక్షించుకుంటే, మనుగడ సుఖవంతమగు,
అనుసంధానిస్తే నదులే, నీటి కరువు దూరమగు! - ఎదురైనప్పుడు సమస్యే, ధైర్యంగా ఉండాలి,
నిస్సహాయులకు ఎప్పుడూ, ఆలంబన ఇవ్వాలి!