Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

రెండవ మంత్రం

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమాః
ఏవం త్వయి నాన్యథేతోteneloluku-letter స్తి న కర్మ లిప్యతే నరే

భావం: రాక్షసుల యొక్క లోకాలు గాఢాంధకారంలో ఆవరించి ఉన్నవి. ఆత్మహంతకులు మరణాంతరం ఆ లోకాలను పొందుతారు. అంటే ఆత్మను చంపుకునే వారు ఎవరైనా తప్పకుండా విశ్వాస హీనమైన పూర్తి అంధకారము మరియు తమోమయమైన ప్రపంచాలు అనబడే లోకాలలో ప్రవేశిస్తారు.

భాష్యం:
లోకం భగవంతునికి చెందినదిగా గ్రహించి అందుకు తగ్గట్లు కర్తవ్యాలను నిర్వహించినప్పుడు అది ఆత్మ సాధన అవుతుంది. ఈ లోకంలో భగవంతుని దర్శించడం ఎలా? అందుకు మొదటి సోపానము మన మనసే, మనసును ఇంద్రియాల కతీతంగా అదుపులో ఉంచుకొని ఎల్లవేళలా ఆ ఈశ్వరుని స్మరిస్తూ, సేవిస్తూ ఉండడమే. ఆ దశలో ఈశ్వరుడే మనమని, మనమే ఈశ్వరునిగా భావించినట్లయితే ఆత్మజ్ఞానం కలుగుతుంది.

ఎక్కువ బాధ్యతలతో కూడి ఉండడం వలన మానవ జీవితం జంతు జీవితం కంటే భిన్నమైనది. ఈ బాధ్యతలను గుర్తించి తదునుగుణంగా ప్రవర్తించే వారు సురులు (దేవతలు) అనబడతారు. బాధ్యతలను గుర్తించలేని వారిని రాక్షసులు ఉంటారు. మానవుడు తన జీవితాన్ని ఆత్మసాక్షాత్కారం కోసం పూర్తిగా ఉపయోగించుకోకపోతే ఆత్మను చంపుకునే వాడిగా పరిగణిస్తారు. ఇలా ఆత్మలు చంపుకునేవాడు శాశ్వతంగా దుఃఖాన్ని అనుభవించడానికి అజ్ఞానాంధకారంతో కూడిన లోకాలకు పోతాడని ఈ ఉపనిషత్తు హెచ్చరిస్తున్నది.

మూడవ మంత్రం

అసుర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనాః

భావం: ఈ మంత్రంలో ఆత్మ యొక్క నైజాన్ని, భగవంతుని స్థితిని వివరించారు.
(ఆత్మ చలనం లేనిది, ఒక్కటే అయినది. మనసు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దానిని పొందలేవు. అది స్థిరంగా నెలకొని ఉంటూనే అన్నింటికన్నా ముందు వెళుతుంది. చలించే వస్తువులన్నింటికన్నా వేగవంతమైన చలనం గలది. అది స్థిరంగా ఉండటం వలన ప్రాణం అన్నింటినీ పనిచేయిస్తుంది.)

భాష్యం: ఒక వస్తువు చలించాలన్నా, పనిచేయాలన్నా, ఆ పనికి ఒక చోటు ఉండాలి. సర్వత్రా వ్యాపించి ఉన్నది ఎక్కడ చలిస్తుంది. అందుకే ఆత్మ చలనం లేనిది. మన మనసు బాహ్యంగా ఒక వస్తువును తలచినప్పుడు అది బయటకు వెళ్లి ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుందని మన తత్వశాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతవరకు విజ్ఞానం కనుగొన్న శబ్ద వేగానికన్నా, కాంతి వేగాకన్నా, అత్యంత వేగంగా మనస్సు పయనించి ఆ వస్తువు యొక్క రూపాన్ని ధరిస్తుంది. ఇలా ఎంత వేగంగా మనసు పయనించినప్పటికీ, మనసు వెళ్లి చేరుకోవడానికి ముందే అక్కడ ఆత్మా లేదా భగవంతుడు ఉంటాడు. అందువల్లనే మనసు కన్నా వేగవంతమైనది, స్థిరంగా నెలకొని ఉంటూనే అన్నింటికన్నా ముందుండేది, వేగవంతమైన వస్తువులన్నింటిలోకి వేగవంతమైనది, అది ఆత్మ గాని భగవంతుడు గాని అని చెప్పబడుతుంది. అంటే చలించే ప్రాణం పనిచేయడానికి చలించని ఆధారంగా ఉండేదే ఆత్మ. అంటే ఒక్కచోటే స్థిరంగా ఉన్నప్పటికీ, అగ్ని తన వేడిమిని, వెలుతురును ఇతర ప్రదేశాలకు కొంతవరకు వ్యాపింప చేయగలదు. అలాగే దేవాది దేవుడు తన దివ్యధామములో స్థిరంగా ఉంటూనే తన వివిధ శక్తులను అన్ని ప్రదేశాలకు ప్రసరింపచేయగలడు.

**** సశేషం ****

Posted in December 2023, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!