Menu Close
Samudraala Harikrishna
చిత్ర వ్యాఖ్య
-- సముద్రాల హరికృష్ణ --
Choopu

చూపు!

లోకమంత నిను చూడగ, వికసిత నేత్రముల,
నీ కేవి గురి యగుర, ఫుల్లాయత పద్మలోచన!
చీకటుల బాపుమనెడి ప్రాకట్య విన్నపములొ,
ఆకొన్న హ్రృదుల,శరణు శరణన్న ప్రార్ధనలో?!


Thelisenule

తెలిసెనులే!

ఆది శేషుని రత్న ఫణమ,గాదిలి సౌమిత్రి చేతి సురటియ!
ఆదిలక్ష్మి అనపాయిత్వమ,అవనిజా త్రపా ముగ్ధ సాన్నిధ్యమ!
బూదిరాయని మారురూపమ, గంధవహసుతు సద్భక్తి దాస్యమ!
ఆ దైత్య వంశ తులసియ,నీ నామజపిత సంగీత కలశియ
(ii)
ఎవ్వరయ్య యజ్నఫలమ రామచంద్ర,కౌసల్యానంద వర్ధన, నీ
వెవ్వరయ్య కారుణ్యవర్ష, నీలాభ్రవర్ణ, సాక్షాద్విష్ణువు గాకన్!!


Virulu

విరులు!

కొమ్మ నున్నను అందమె,కొమ్మల పెన్నెఱి వేణుల నున్నను!
అమ్మ గళమాల నున్నను భాగ్యమె,పదముల వ్రాలినను!
కమ్మని తావుల,మనముల నలర్చు శాంత వర్ణాలయము
లిమ్మహి విరుల సాటి దేవదేవు స్రృష్టి యేది, అద్భుతమై!!


Asacharyam

ఆసచర్యం!

తెల్లని వెలుగుల నింగి రేని కేమాయెనో
బల్ వింతల కొంగొత్త పోకడల నేర్చినాడు!
చలువ జోళ్ళు దాల్చును, నవ్వుకొను బీరాన!
తుల ఏది నాకని, తీయును రాగాలేవియో!!

Posted in December 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!