Menu Close
Lalitha-Sahasranamam-PR page title

పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము)

(అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700

611. ఓం కళాత్మికాయై నమః

సర్వకళామతల్లికి నమోవాకాలు.


612. ఓం కళానాథాయై నమః

కళానాథ (చంద్ర) స్వరూపిణికి ప్రణామాలు.


613. ఓం కావ్యాలాపవినోదిన్యై నమః

కావ్యాలాపంతో వినోదించునట్టి మాతకు ప్రణామాలు.


614. ఓం సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితాయై నమః

కుడివైపు లక్ష్మీ, ఎడమవైపు సరస్వతి నిలచి వారిచే సేవింపబడు మాతకు ప్రణామాలు.


615. ఓం ఆదిశక్యై నమః

ఆదిశక్తియైన మాతకు వందనాలు.


616. ఓం అమేయాయై నమః

కొలవరాని అతీతమూర్తికి ప్రణామాలు.


617. ఓం ఆత్మాయై నమః

ఆత్మస్వరూపిణికి ప్రణామాలు.


618. ఓం పరమాయై నమః

ఉత్కృష్ట రూపం కల తల్లికి వందనాలు.


619. ఓం పావనాకృత్యై నమః

పవిత్రమైన ఆకారం కల జననికి వందనాలు.


620. ఓం అనేకకోటి బ్రహ్మాండజనన్యై నమః

అనేక కోటి బ్రహ్మాండాలు తల్లి అయిన దేవికి వందనాలు.


621. ఓం దివ్యవిగ్రహాయై నమః

దివ్యస్వరూపం కల తల్లికి ప్రణామాలు.


622. ఓం క్లీంకార్యై నమః

‘క్లీం’ కామరాజ బీజము. అట్టి క్లీం బీజ స్వరూపిణికి నమస్కారాలు.


623. ఓం కేవలాయై నమః

సర్వధర్మాతీతయై ‘కేవల’ గా ఉండు అద్వితీయ మూర్తికి వందనాలు.


624. ఓం గుహ్యాయై నమః

రహస్యాతి రహస్య స్వరూపిణికి ప్రణామాలు.


625. ఓం కైవల్యపదదాయిన్యై నమః

సర్వోత్కృష్టమై సామాన్యజన దుర్లభమైన కైవల్యపదాన్ని-తన భక్తజనులకు ప్రసాదించునట్టి తల్లికి వందనాలు.


626. ఓం త్రిపురాయై నమః

త్రిపురసుందరీ దేవికి వందనాలు.


627. ఓం త్రిజగద్వంద్యాయై నమః

ముల్లోకవాసులచే వందనాలందుకొనునట్టి తల్లికి వందనాలు.


628. ఓం త్రిమూర్త్యై నమః

త్రిమూర్తి స్వరూపిణికి నమోవాకాలు.


629. ఓం త్రిదశేశ్వర్యై నమః

దేవతలకు నాయికయైన ఈశ్వరికి వందనాలు.


630. ఓం త్ర్యక్షర్యై నమః

వాగ్భవ, కామ, శక్తి-యివి మూడు బీజాక్షరాలు. త్రక్షరీ స్వరూపిణికి వందనాలు.


631. ఓం దివ్యగంధాఢ్యాయై నమః

దివ్యగంధాను లేపనాలతో కూడి భాసిల్లు దేవికి వందనాలు.


632. ఓం సింధూర తిలకాంచితాయై నమః

సింధూరం తిలకంతో శోభిల్లునట్టి జననికి వందనాలు.


633. ఓం ఉమాయై నమః

బ్రహ్మ విద్యాధిష్ఠాన దేవియైన ఉమాభగవతికి ప్రణామాలు.


634. ఓం శైలేంద్ర తనయాయై నమః

శైలేంద్రుడయిన హిమరాజనందినియగు పర్వత రాజపుత్రికి వందనాలు.


635. ఓం గౌర్యై నమః

గౌరవర్ణంకల గౌరీదేవికి ప్రణామాలు.


636. ఓం గంధర్వసేవితాయై నమః

గంధర్వులుచే సేవించబడు జననికి ప్రణామాలు.


637. ఓం విశ్వగర్భాయై నమః

విశ్వాన్ని గర్భంలో ధరించిన మాతకు ప్రణామాలు.


638. ఓం స్వర్ణగర్భాయై నమః

స్వర్ణగర్భమూర్తికి ప్రణామాలు.


639. ఓం అవరదాయై నమః

దుష్టులను అనుగ్రహించని, దుష్టులకు నాస్తికులకు వరాలను యీయని మాతకు నమస్కారాలు.


640. ఓం వాగధీశ్వర్యై నమః

వాక్కును శాసించునట్టి ఈశ్వరికి ప్రణామాలు.

----సశేషం----

Posted in December 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!