Menu Close
ఆర్. శర్మ దంతుర్తి
తెలుగు పద్య రత్నాలు 65
ఆర్. శర్మ దంతుర్తి

ఈ నెల మరోసారి మొల్ల రామాయణంలో పద్యం చూద్దాం. ముందొకసారి చెప్పుకున్నట్టూ, మొల్ల రామాయణంలో రాముడు పెద్ద శూరుడు. అది చెప్పడానికి మొల్ల వాడే తెలుగు పదాలు వాడడం చూస్తే వళ్ళు గగుర్పాటు కలుగుతుంది. రాముడు ఎదురుగా కనిపిస్తే అసలు మిగతా ప్రపంచం గుర్తు వచ్చేది కాదుట జనాలకి. ఆయన రూపు అటువంటిది. రామబాణం గురించి తెల్సినదే కదా? ఎక్కుపెట్టిన రామబాణానికి తిరుగులేదు – అది సముద్రుడిమీద ఎక్కుపెట్టినా, కాకిమీద వేసినా. జనకుడి సభలో లక్ష్మణుడు చెప్పాడు కదా రాముడు శివధనస్సు ఎత్తగలడు అని. ఆ తర్వాత విశ్వామిత్రుడికి నమస్కారం చేసి ముందుకి కదిలాడు. ఎదురుగా ఉన్నది శివధనస్సు అని తెలుసు. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అందువల్ల దాన్ని కళ్ళకి అద్దుకుని ఎత్తాడు. ఆ ఎత్తడం, అది విరగడం ఎలా జరిగిందో చెప్పేదే ఈ నెల మొల్ల రామాయణంలో పద్యం.

మ.
ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్‌ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబు చే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్‌,
దునిఁగెన్‌ జాపము భూరి ఘోషమున, వార్ధుల్‌ మ్రోయుచందంబునన్‌. [మొల్ల రామాయణం. 82]

మామని సంహరించి అనగానే గుర్తొచ్చేది కృష్ణుడు కదా? అదే చెప్తున్నారు ఇక్కడ, కంసుడనే మేనమామను చంపి; రెండో మామ కి గర్వం అణిచాడుట. ఎవరా రెండో మామ? లంకానగరానికి దారి ఇవ్వమని సముద్రుణ్ణి అడిగితే ఆయన గర్వంతో సమాధానం చెప్పలేదు. అందువల్ల ఒక బాణం తీసి సముద్రాన్ని ఎండగట్టబోయేసరికి బయటకి వచ్చాడు గర్వం తగ్గించుకుని. అందువల్ల సముద్రుడి గర్వం అణిచిన మామ రాముడు (విష్ణువు). అయితే సముద్రుడు మామ ఎలా అయ్యాడు విష్ణువుకి? లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కనక ఆవిడని భార్యగా చేసుకున్న విష్ణువుకి సముద్రుడు ‘పిల్లని ఇచ్చిన మామ’ ఇక్కడ.

ఎత్తినవాడు ఎవరు? సూర్యవంశంలో పుట్టిన రాఘవుడు (ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు). రఘువంశంలో పుట్టాడు కనక రాఘవుడు. మిగతా రాజులు (భూమీశాత్మజుల్‌ - భూమిని పరిపాలించేవారు, రాజులు) ఆశ్చర్యంతో చూస్తూండగా (వేడ్కతో దను వీక్షింప), విశ్వామిత్రుడు సంతోషించేలాగా (మునీశ్వరుం డలర) కోదండం చేతిలోకి అందుకున్నాడు (కోదండంబు చే నంది). చటుకున్న పైకెత్తి దానిని సునాయాసంగా వంచి, అల్లెత్రాటిని బిగించి, (చివ్వన మోపెట్టి, గుణంబు పట్టి) తన భుజబలంతో సారించేసరికి (పటు బాహా శక్తితోఁ దీసినన్‌) ఏమైంది? ధనస్సు విరిగిపోయింది (దునిఁగెన్‌ జాపము). అయితే అది విరిగేటప్పుడు ఎటువంటి ధ్వని వచ్చింది? భూరి ఘోషమున - భూరి అంటే అతి పెద్దదైన (లక్ష అంటే 1 తర్వాత 5 సున్నాలు అనుకుంటే, భూరి అంటే 1 తర్వాత 35 సున్నాలు), సముద్రాలు పొంగి హోరెత్తితే తే వచ్చే ధ్వని లాగా ఉందిట అది (వార్ధుల్‌ మ్రోయుచందంబునన్‌). ఈ పద్యం రాయడానికి ముందే మొల్ల రాసిన పద్యం చూసాం లక్ష్మణుడు చెప్పడం - కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర (పద్య రత్నాలు 63). ఇటువంటి శబ్దం వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పారు కనక ఈ పద్యంలో వచ్చే ధ్వనిని “భూరి ఘోషమున, వార్ధుల్‌ మ్రోయుచందంబునన్‌” అనే అలంకారం బాగా సరిపోయింది కదా?

ఇందులో రెండు విషయాలు చూద్దాం. పద్యంలో కవయిత్రి ‘కోదండంబు’ అన్నారు. కోదండం రాముడు “మా-త్ర-మే” వాడే ధనస్సు అని అర్ధం చేసుకోవచ్చు. కానీ తెలుగు పదకోశం చూస్తే వెదురు విల్లు, ధనస్సు అనే అర్ధాలు కనిపిస్తాయి. వెదురు విల్లుతో రాముడు రావణుణ్ణి చంపలేడు కదా?  రావణ సంహారం చేసిన రాముడి చేతిలో ధనస్సు వనవాసానికి బయల్దేరుతూంటే అయోధ్యనుంచి పట్టుకెళ్ళినది కాదు. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఒక్కో ముని ఆశ్రమాన్ని దర్శించుకుంటూ పోతూంటే అగస్త్యాశ్రమం వచ్చేసరికి ఆ ముని “రామా ఈ ధనస్సు నీ దగ్గిర ఉంటేనే బావుంటుంది,” అని ఓ ధనస్సు ఇస్తాడు రాముడికి. అసలు ఈ అరణ్య వాసమే ఒక పెద్ద ప్రహేళిక. రాముడు అరణ్యానికి ఎందుకు పంపబడ్డాడో వీళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు రాముడితో చెప్పరు. “రామా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కానీ ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది మీకు,” అంటూ పంచవటికేసి తోస్తారు ముగ్గుర్నీ. ఇంతకీ పంచవటికి వచ్చేదాకా రాముడి దగ్గిర రావణుణ్ణి చంపేటందుకు సరైన ధనస్సు లేదు. అంటే మొదటిసారి విశ్వామిత్రుడి కూడా వెళ్ళేటప్పటికి కూడా రాముడు మామూలు రాముడే. ఆ తర్వాత పంచవటికి వెళ్ళేసరికి కోదండ రాముడు – అగస్త్యుడు ఇచ్చిన ధనస్సు తో.  అయితే ఇక్కడ కవయిత్రి వాడిన విషయం ప్రకారం, రాముడి చేతిలో ఏ విల్లు ఉన్నా దాన్ని కోదండం అనవచ్చు. అలా ఇక్కడ శివధనస్సు కోదండం అయింది.

ఎవరూ ఎత్తలేని శివధనస్సుని రాముడు అంత సులభంగా ఎలా ఎత్తాడయ్యా అనే ప్రశ్నకి ఒక వింత సమాధానం మనం విశ్వనాధ సత్యన్నారాయణ గారి కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి గారు రాసిన ‘సీత’ అనే కధలో చూడవచ్చు. సీత అంటే మహాలక్ష్మీ అవతారం, ఆవిడ ఉండేది శ్రీ చక్రం మధ్యలో. విశ్వామిత్రుడి అక్కతో సహా అనేకమంది శ్రీచక్రం పూజిస్తూ ఉండేవారుట రావణుడు పెట్టే కష్టాలు భరించలేక.  అయినా వాడు వేదవతిని చెరపట్టాక ఆవిడ శాపం ఇచ్చింది. అప్పట్నుండి మిగతా మహిళలని ముట్టుకోవడం మానేసాడు. సీత పుట్టినప్పుడు బంతితో ఆడుకుంటూంటే అది ఈ శివధనస్సు ఉన్న బండి కిందకి దొర్లింది. ఆ బండిని సీత ఒక చేత్తో దూరంగా జరిపి బంతి తీసుకోవడం జనకుడు చూసాడు. అమ్మో ఇవిడ మామూలు మనిషికాదు. ఈ శివధనస్సుని ఎత్తినవాడే ఈవిడని పెళ్ళిచేసుకోగలడు అని అలా స్వయంవరం ప్రకటించాడు జనకుడు. అయితే ఎవరూ ఎత్తలేకపోయారు. రాముడు రావడం ఈవిడ చెలెకత్తెల ద్వారా విని తన దగ్గిర ఉన్న (శ్రీ చక్రం బొమ్మ ఉన్నది) వేలి ఉంగరం బండి మీద ఉన్న ధనస్సు దగ్గిర పెట్టించిందిట సీత. రాముడు మొదట ధనస్సు దగ్గిరకి వెళ్ళేసరికి ఆ శ్రీచక్రం ఉన్న ఉంగరం కనిపించింది. దానికి, ధనస్సుకీ నమస్కారం పెట్టి ధనస్సు ఎత్తబోయేంతలో ఆ ఉంగరం చేతికి తగిలింది. దానితో శ్రీచక్రం లో ఉన్న అమోఘమైన శక్తి రాముడికి చేరింది. అలా రాముడు అనే మామూలు మానవుడు శ్రీ చక్రం శక్తితో శివధనస్సుని ఎత్తాడుట.  బాగుంది కదా కధ?

ఏదైతేనేం మొల్ల రామాయణంలో రాసిన పద్యాలలో రాముడి శూరత్వం అతి సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

తెలుగులో ఒక పదానికి అనేకానేక అర్ధాలు ఉన్నప్పుడు వాటిని నానార్ధాలు అనడం అలవాటు. అలా నానార్థాలలో ‘రాజు’ అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉంది. ఈ విషయం మూడో మామలో చెప్తున్నాను (మామను రాజు చేసి). దీనికి అర్ధం ఏమిటంటే, చందమామను రాత్రి కి (నిశా) రాజుగా చేసాట్ట. వామనావతారం మొదలు పెట్టబోయేముందు శుకమహర్షి చెప్తాడు పరీక్షిత్ తో “మనువులూ, ఋషులూ, మనువుల కొడుకులూ, ఇంద్రులూ, దేవతలూ విష్ణుదేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైనవారు అందరూ విష్ణుదేవుని అంశముతో రూపు దాలుస్తారు. అతని సహయంవల్ల మనువులు లోకాలను ఏలుతారు (పోతన భాగవతం 8-433).” ఈ మనువులూ, ఋషులూ నవగ్రహాలూ ఒక దారిలో పెట్టి ఈ మన్వంతరం మీరు ఏలాలి అని చెప్తాడు. ఇదే చందమామని రాత్రికి రాజుగా చేయడం అంటే. నాలుగో మామ పాండురాజు. కుంతి కృష్ణుడికి అత్త అవుతుంది కనక పాండురాజు కృష్ణుడికి మామ వరస కదా. ఆ మామ కొడుకు అర్జునుడు. అతనికి ఆత్మ బంధువైన వాడు; కృష్ణుడు లేకుండా అర్జునుడు లేడు కనక ఆత్మ బంధువు కృష్ణుడే (యొకమామ తనూజున కాత్మబంధువై).

ఐదో మామ ధృతరాష్ట్రుడు. కురుక్షేత్ర సంగ్రామం మొదలవకముందు రాయబారిగా వచ్చాడు కృష్ణుడు కౌరవ సభకి. అక్కడ స్పష్టంగా చెప్పాడు ‘సారపు ధర్మమున్ విమల సత్యము…’ (తెలుగు పద్య రత్నాలు – 4) అంటూ. ఇంత చెప్పినా సర్వనాశనం తన్నుకు వస్తూ నెత్తి మీద కూర్చున్నప్పుడు దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించడానికి సన్నాహాలు చేయడం సాత్యకి గమనించి చెప్తాడు. అప్పుడు సభలో అందరికీ తన నిజ స్వరూపం చూపిస్తాడు కృష్ణుడు నేను ఒక్కణ్ణే అనుకుంటున్నావు కాబోలు చూడు అంటూ అక్కడే కూర్చున్న ధృతరాష్ట్రుడికి కూడా కనిపించడానికి కాసేపు దృష్టి ప్రసాదించడం మహాభారతంలో చూడవచ్చు. అయినా వాళ్ళకి బుద్ధిరాదు కనక మిగిలినది సర్వనాశనం. ఇదే పద్యంలో చెప్పిన “ఒక మామకు కన్నులిచ్చి” అంటే – రాయబారం సమయంలో ధృతరాష్ట్రునికి తాత్కాలికంగా దృష్టి ఇవ్వడం.

ఆరో మామ – తన తపస్సుకి అడ్డం వచ్చిన మన్మధుణ్ణి పరమేశ్వరుడు మూడో కన్నుతో దగ్ధం చేసాక రతీదేవి అడుగుతుంది ‘మా ఆయన తప్పు లేదు ఇందులో, దేవతలు అడిగితే ఇలా చేసాడు’ అని. అయితే “కృష్ణుడికి కొడుకుగా పుడతాడు, నీకు మాత్రం మామూలుగా కనిపిస్తూనే ఉంటాడు” అని శివుడు వరం ఇచ్చాడు. అలా పుట్టినవాడే కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి భార్య రతీదేవి (మాయవతి అని కొంతమంది అంటారు) కి కృష్ణుడు తానే మామగారు అయ్యాడు కదా. ఇదే ఆరోమామ గా చెప్పారు పద్యంలో – “సుతుమన్మధునింతికి దానె మామయై.” ఏడో మామ మరొకసారి సముద్రుడే. అయితే ఎనిమిదో మామ ఎవరంటే ముందు ఏడో మామ కి మామ అయినవాడు. దీని కధ కొంచెం విపులంగా చూద్దాం.

గంగ విష్ణుపాదాల దగ్గిర ఉద్భవించి బ్రహ్మ కలశంలో చేరుతుంది. అక్కడనుంచి కిందకి రావడానికి భగీరధుడు ప్రయత్నం చేసాడు (తెలుగు పద్య రత్నాలు – 38). బ్రహ్మ తన కలశంలో గంగని వదిలినా గంగ కోసం మరో తపస్సు. ఆవిడ కింద పడి భూమికి అపాయం చేయకుండా కాచుకోవడానికి శివుడు తన తలమీద ధరించాలి. దానికి మరో తపస్సు అయ్యాక గంగ భువికి దిగింది. అక్కడనుంచి సగరుల భస్మాలమీదుగా పారి సముద్రంలో కలుస్తుంది గంగ.  గంగానది విష్ణువుకి కూతురుకింద లెక్క తన పాదాల దగ్గిర పుట్టింది కనక. అలా తన కూతుర్ని సముద్రుడికి ఇచ్చాట్ట విష్ణువు. అందువల్ల సముద్రుడికి విష్ణువు మామ. అయితే ముందు చెప్పుకున్నట్టూ విష్ణువుకి తన కూతుర్ని (లక్ష్మీదేవి) ని ఇచ్చాడు కనక సముద్రుడు విష్ణువుకి మామ. అలా మామకు మామ అయ్యాడు.

ఇంతకీ పద్యం చెప్పేది ఏమిటంటే ఇటువంటి మామ అయిన పరమాత్ముడి అనుగ్రహం మీ మీద ఉండు గాక అని చెప్తున్నారు (పరమాత్ముడు మీకు బ్రసన్నుడయ్యెడున్).

********

Posted in November 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *