కదంబం - సాహిత్యకుసుమం
ఒక్క వాక్యం అల్లుకోలేదు..
- శ్రీ సాహితి -
కాలం గీసిన చిత్రంలో
పక్కనే ఉన్నట్లుగా ఉన్నా
ఎక్కువసార్లు వెనకనే ..
మా ఊరిలో
ఒకే వీధిలో ఉన్న
అచ్చం మా ఇల్లులాగే
ఏ కుంచె కళ్లలో పడ్డానో!
ఏ రంగు ఒలికి
మెరిసానో!
నా ముఖానికి
గుర్తింపు వచ్చి
ముందుకొస్తే
పేరు పిలిస్తే
అందం ప్రేమిస్తే
ఆనందం ఆహ్వానిస్తే
ఊరంతా
మౌనం ముసురులో
గొంతులన్నీ పూడిపోయి
నన్ను చూడనట్టుగా
నన్ను విననట్లుగా
మాటను చాటేసి
దూరంగా
కోటగోడలా
మధ్య అగాథంలా
ఎవరి నుండి ఒక్క మాట
నన్ను ముట్టుకోలేదు.
మనసును
ఒక్క వాక్యం అల్లుకోలేదు..
దిక్కులు మారుమ్రోగేలా
నాలో నేను
ఒక్కడినే.....