Menu Close
Lalitha-Sahasranamam-PR page title

చతుర్దశ అధ్యాయం (చతుష్షష్టి యోగినీ వివరములు)

శ్లోకాలు: 110/2-120, సహస్రనామాలు: 535-600

535. ఓం స్వాహాయై నమః

‘స్వాహా’ రూపిణికి నమస్కారాలు.


536. ఓం స్వధాయై నమః

‘స్వధా’ స్వరూపిణికి ప్రణామాలు.


537. ఓం అమత్యై నమః

‘అవిద్యా’ స్వరూపిణికి ప్రణామాలు.


538. ఓం మేధాయై నమః

మేధా స్వరూపిణికి నమస్కారాలు.


539. ఓం శ్రుత్యై నమః

శ్రుతి-- అంటే వేదం స్వరూపిణికి నమోవాకాలు.


540. ఓం స్మృత్యై నమః

స్మృతులనగా--స్మరించి అనుసరించి ఆచరించిన ధర్మశాస్త్రము. అట్టి స్మృతి స్వరూపిణికి ప్రణామాలు.


541. ఓం అనుత్తమాయై నమః

అనుత్తమమూర్తికి వందనాలు.


542. ఓం పుణ్యకీర్త్యై నమః

పుణ్యకీర్తిగల మాతకు వందనాలు.


543. ఓం పుణ్యలభ్యాయై నమః

పుణ్యకార్యాల వలన మాత్రమే లభించునట్టి మాతకు వందనాలు.


544. ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః

శ్రీలలితానామ, గుణ, లీలాదుల శ్రవణకీర్తనాదుల మాత్రాన పుణ్యం లభిస్తుంది.


545. ఓం పులోమజార్చితాయై నమః

పులోమమహర్షినందన అయిన శచీదేవిచే అర్చించబడిన తల్లికి ప్రణామాలు.


546. ఓం బంధమోచన్యై నమః

ప్రకృతి బంధనాల నుండి, సంసార బంధనాల నుండి కూడ ముక్తిని ప్రసాదించగల మహేశ్వరికి ప్రణామాలు.


547. ఓం బంధురాలకాయై నమః

దట్టమైన కేశపాశం కల తల్లికి ప్రణామాలు.


548. ఓం విమర్శరూపిణ్యై నమః

విమర్శించ గల మహత్తర శక్తి స్వరూపిణికి ప్రణామాలు.


549. ఓం విద్యాయై నమః

మోక్షదాయకమగు విద్యా స్వరూపిణికి వందనాలు.


550. ఓం వియదాది జగత్ప్రసవే నమః

ఆకాశాది పాంచభౌతిక జగత్తును సృష్టించు మాతకు వందనాలు.


551. ఓం సర్వవ్యాధి ప్రశమన్యై నమః

శారీరక బాధలైన వ్యాధులను, మానసిక బాధలైన వ్యాధులనూ- సర్వవ్యాధులనూ రూపుమాపునట్టి మాతకు వందనాలు.


552. ఓం సర్వమృత్యు నివారిణ్యై నమః

అపమృత్యు, అకాలమృత్యువాదిగాగల సర్వమృత్యువులనూ నివారించునట్టి మాతకు వందనాలు.


553. ఓం అగ్రగణ్యాయై నమః

జగదాది కూడా ఆదిమూర్తి అయిన ప్రప్రథమంగా గణించదగిన మాతకు వందనాలు.


554. ఓం అచింత్యరూపాయై నమః

చింతించుటకు వీలుకాని మహత్తర స్వరూపిణికి ప్రణామాలు.


555. ఓం కలికల్మషనాశిన్యై నమః

కలికాల సంబంధమైన సమస్త కల్మషాలనూ నాశనం చేయునట్టి మాతకు ప్రణామాలు.


556. ఓం కాత్యాయన్యై నమః

దేవతలందరి తేజస్సుతో కత్యుడనేమహర్షి పుత్రిక అవతరించిన కాత్యాయనీ దేవికి ప్రణామాలు.


557. ఓం కాలహంత్ర్యై నమః

కాలాన్ని సైతం హరించునట్టి దేవికి వందనాలు.


558. ఓం కమలాక్ష నిషేవితాయై నమః

కమలాక్షుడంటే శ్రీహరి. అట్టి శ్రీహరిచేత కూడా సేవింపబడిన తల్లికి వందనాలు.

----సశేషం----

Posted in September 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!