Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. నిమ్న జాతివారలనుచూ, చులకనగా చూడకుము!
    జాతి మత భేదములంటూ, హేళన గావించకుము!
  2. ఉపకారమును చేయుటకై , వెనుక అడుగు వేయకు,
    అపకారము చేయవలెనను, యోచన అసలు చేయకు!
  3. మెలుగు సఖ్యతగ అందరితో, పంచు స్నేహభావాలు
    పదుగురితో కలిసి మెలుగుతు, నిలుపుకొనుము బంధాలు!
  4. ఇంటి ఇంతి ఆనందమే, గృహమున సుఖము నింపును
    చిన్నారుల చిరునవ్వులే, ఇంటికి వెలుగు తెచ్చును!
  5. మార్కులు కొలబద్దలైతే, జ్ఞానము వంటబట్టదు
    మనసున ఒత్తిడి పెరిగితే, పరిణితి మదిని ముట్టదు!
  6. విడని గట్టి బంధముయనుచు, తెగే దాకా లాగకు,
    నమ్మ దగిన వారు అయినా, ఏమరపాటు చూపకు!
  7. జులుము హద్దులు మీరినపుడు, గోవు పులై గర్జించు,
    నిస్వార్థపు ప్రేమ దొరికెనా, ఎండు మోడు చిగురించ!.
  8. రేడియేషను పెరిగినచో, ఊపిరి కడగడుతుంది!
    ప్రకృతిని పరిహసించినచో, బ్రతుక కష్టమౌతుంది!
  9. కడలి ఆటుపోట్ల వలెనే, బ్రతుకున కష్ట సుఖాలు,
    సుఖాల కెరటాల వెనుకే, వచ్చును బాధల అలలు!
  10. చెరువు పూడ్చి కట్టిన ఇళ్ళు, వరదలలో మునిగేను,
    నేలను గౌరవించకున్న, కరువు కబళించేను!

**** సశేషం ****

Posted in September 2023, సాహిత్యం

4 Comments

  1. సత్యవతి దినవహి

    మీ సూచనలు జ్ఞప్తికి ఉంచుకుంటాను. ధన్యవాదాలు.

  2. J K మోహన రావు

    ప్రయత్నము బాగున్నది.

    దోహా లక్షణములు:

    పూర్వార్ధము – 13 మాత్రలు, జగణముతో ప్రారంభము నిషిద్ధము, చివర ర,స,న గణములలో ఒకటిగ నుండాలి.

    ఉత్తరార్ధము – 11 మాత్రలు, చివర జ లేక తగణము

    తెలుగులో ప్రాస, అక్షరసామ్య యతులు ఉండాలి. హిందీ కావున అంత్యప్రాస (తుక్), విరామయతి ఉండాలి. కావున దోహాకు ప్రాస, అంత్య ప్రాస, పాదములలో విరామ, అక్షరసామ్య యతులు అవసరము.

    ఒక ఉదాహరణము:

    కడలి యాటుపోటు లనగా – కష్టసుఖాలు నిజమ్ము
    వెడలు సుఖమ్ముల కెరటములు – వెనుక వచ్చు దుఃఖమ్ము

    – మోహన

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!