Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

జీవితం-కవిత్వం
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు -

నా కవిత్వంలో జీవితం తప్ప ఏముంటుంది?
నా జీవితం కవిత్వమని తప్ప వేరే ఏమంటుంది?
అన్నిటికన్నా కవిత్వమే నా జీవితానికి ఎక్కువ,
అన్నింటిలోకి జీవితమంటే నా కవిత్వానికి మక్కువ.
నా కవిత్వమెప్పుడూ జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది,
నా జీవితమెప్పుడూ కవిత్వాన్ని శ్వాసిస్తూ ఉంటుంది.
నా జీవితమంటే కవిత్వానికి సానుభూతి,
కవిత్వమంటే నా జీవితంలో ఒక అనుభూతి.
రీతిగా నప్పే జీవితాన్ని నా కవిత్వం ఇష్టపడుతుంది,
నీతిని చెప్పే కవిత్వాన్ని నా జీవితం ఇష్టపడుతుంది.
జీవితం శాపలపాలైనప్పుడు దాన్ని ఓదారుస్తుంది కవిత్వం,
కవిత్వం లోపాలపాలైనప్పుడు దాన్ని సరిచేస్తుంది జీవితం .
కవిత్వం జీవితాన్ని,జీవితం కవిత్వాన్ని
చక్కబరచటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి.
ఒకదానినొకటి అర్ధం చేసుకొని పరస్పరం ప్రేమిస్తూనే ఉంటాయి.

Posted in August 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *