కదంబం - సాహిత్యకుసుమం
మన ఘనత
- చందలూరి నారాయణరావు -
అది
సభో...సంబరమో
పెళ్ళో... చావో
పుట్టలుపుట్టలుగా జనం...
చెవులకు విశ్రాంతి ఉండదు.
ప్రతి రూపాయిని
వేటాడే ఆటలో అలుపే ఉండదు.
ఈ వారసత్వ మోతలో
రాను రాను
సంతోషాల పరుగు పందెంలో
గాయాలే ఆనందాలు....
పారేసుకుని పోగేసుకోవడం
బోర్లపడి బాధ్యతనుకోవడం
కాని వాటి కోసం కన్నీళ్ళుపెట్టుకోవడం
బతుకు తొలి అల్లికే
నిజాలను తప్పుకుని
అల్లుకోవటం గొప్ప సంతోషం
ఎన్నో పేర్లతో
పాటించే తీపి గాయాలకు
గర్వపడే విచిత్ర విషాదమే
మన ఘనత.