స్రవంతి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శ్లో. లక్ష్మీం చన్ద్రసహోదరీం భృగుసుతాం భాస్వత్కలాపాన్వితాం(1)
పద్మాక్షీం గజరాజనాదముదితాం గఙ్గాప్లుతాఙ్గీం జగ
ద్వన్ద్యానన్యశుభప్రదస్మితముఖీ మష్టస్వరూపాత్మికాం
శ్రీమద్వేఙ్కటనాయకాగ్ర్యహృదయస్థవ్యూహలక్ష్మీం భజే
(1)కలాపః=భూషణమ్/శరీరమ్
భావము-
శ్రీమహాలక్ష్మిని, చంద్రుని తోబుట్టువును, భృగుమహర్షి కుమార్తెను,
ప్రకాశిస్తున్నఅలంకారములు/శరీరము కలదానిని, కమలముల వంటి
కన్నులు కలదానిని, శ్రేష్ఠమైన ఏనుగుల ఘీంకారములతో సంతోషము
నొందు దానిని, గంగాజలముతో తడిసిన శరీరముకలదానిని, లోకముల
చేత నమస్కరింపదగి శుభములను కలిగించు చిరునవ్వు చిందు మోము
కలదానిని, అష్టలక్ష్ములరూపములు దాల్చుదానిని, శ్రీమంతమైన
వేంకటేశ్వరుని శ్రేష్ఠమైన హృదయముపై వసించు వ్యూహలక్ష్మిని భజింతును.
ఏకమల్లికార్చన
[గృహప్రాంగణమున పూసిన ఒకే ఒకమల్లెపూవుతో వివిధదేవతార్చన]
మ.కో. ఏకపుష్పమొసంగె మల్లియ శ్రీశు నీశు గణేశునిన్
లోకమాతను(1) సత్యదేవుని లోకబంధుఁ ద్రిమూర్తిది
వ్యైకరూపుని లోకపాలినిఁ(2) గృత్తికాసుతు శారదన్
శ్రీకపీశగురూత్తమార్చితనీలవర్ణు(3) భజింపఁగన్
(1) లక్ష్మీదేవిని (2) లలితాదేవిని (3) శ్రీరాముని
సరస్వతీవిన్నపము
కం. నీ కృప యమోఘ మమ్మా !
నాకయి బట్టుక రచింప నా పద్యములే
లోకోత్తరభావంబుల
ప్రాకట మొనరించి మించు రసగుళికలుగా
చం. నిను గని నీ పదాబ్జముల నిత్యము నే స్పృసియించి మ్రొక్కఁగాఁ
గనులను బాష్పవారి(1) యుబుకన్ గన దుర్లభమైన, జ్ఞానలో
చనములఁ గాంచు భాగ్య మిడి స్పష్టముగాఁ గనిపించు శారదా!
యనయము నా యెడన్ నిలువుమా కలహంసపయిన్ మదంబికా!
(1)అనందబాష్పములు
శా. వాగ్దేవీ! త్వదనుగ్రహాప్తకవితన్ భావంబు శబ్దంబులున్
దిగ్దంతుల్ కొనియాడ నుద్భవ మగున్, దివ్యప్రభాతాన మా
దృగ్దాసున్(1) గరుణించి లేపిన నినున్ దృక్పర్వమై కాంచ వి
ష్వగ్దేదీప్య(2)మహానుభూతి కలుగున్ సర్వార్థసంధాయినీ!
(1)మాదృక్=నావంటి, దాసుని (2) అంతటా ప్రకాశవంతమైన
6