తెలుగు దోహాలు
- మంచి సహనం కోల్పోయిన, చెడుకు తప్పదు నాశనము,
నీతి త్రినేత్రము తెరిచెనా, మిగులు అవినీతి భస్మము! - కోర్కెలు శ్రుతిమించినపుడే, బ్రతుకు గతి తప్పుతుంది,
పనిలో అలసత్వముంటే, గమ్యము ఎడమవుతుంది! - చక్కని నాయకత్వంలో, రాష్ట్రమగును సుభిక్షము,
యోచన లేనట్టి పనులే, ప్రగతికి అవరోధకము! - పగ ప్రతీకారాలెపుడూ, స్వీయ ప్రగతి అడ్డేను,
దుష్టులతో స్నేహమెపుడూ, కడగండ్లను తెచ్చేను! - నేనే ముఖ్యమనుకుంటే, వృద్ధి వెనుకబడుతుంది,
పదుగురితో నడిచినపుడే, ప్రగతి సాధ్యమౌతుంది! - మానవత్వం మరిచేవా, బ్రతుకుకుండదు అర్థము,
చేసిన మేలు మరిచేవా, మనిషివనుటే వ్యర్థము! - అవినీతిని తరిమినపుడే, నైజముతో మనగలవు,
సన్మార్గములో నడిస్తే, కీర్తిని గడించగలవు! - సొమ్ము విసిరి కొన్న డిగ్రీ, విలువలేని నోటు,
సర్కారుతో పని ఉందా, చేత పెట్టు ఓ నోటు! - శాంతి సుఖము కోరుకుంటే, వీడు అసూయ ద్వేషము!
ఆరోగ్యం విస్మరిస్తే, కబళించేను రోగము! - నిప్పులలో కాలితేనే, ఇనుముకి రూపు వచ్చును,
బాధ అనుభవించితేనే, సుఖము విలువ తెలియును.