Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

బౌద్ధంలో పదార్ధమా?చైతన్యమా?

(బౌద్ధ ధర్మం)

ఆస్తికులకు నాస్తికులకు తరాల తరబడి ఒకటే చర్చ
పదార్ధం ముందా? చైతన్యం ముందా?

ఆధ్యాత్మికత ఆవరించినప్పటికీ తార్కిక దృష్టి ఉన్న వ్యక్తికి “వ్యక్తిక దైవం” పట్ల విశ్వాసం ఉండదు. కానీ పై ప్రశ్నకు సమాధానం తెలుసు కోవడం కోసం సత్యాన్వేషణ చేస్తుంటాడు.

పదార్ధం యొక్క అత్యున్నత పరిణామ దశలో చైతన్యం ఉద్భవిస్తుందని భౌతిక వాస్తవికవాదులంటారు. బ్రహ్మమే విశ్వంగా పరివ్యాప్తమైయ్యిందంటారు అద్వైతులు.

రైలు పట్టాల్లాగా ఈ రెండు వాదనలూ ఎప్పుడూ కలవకుండా అలా పయనిస్తూ ఉంటాయి.

Eienstein once said, “if there is any religion that could cope with modern scientific needs it would be Buddhism”.

“Of the great religions of history, I prefer Buddhism, especially in its earliest forms, because it has had the smallest element of persecution” – Bertrand Russell, in what is an Agnostic? (1953)

ఇప్పుడు పైన ఆంధ్రంలో, ఆంగ్లంలో రాసిన రెండు విషయాలకు ఉన్న సంబంధాన్ని విశదీకరిస్తాను.

Eienstein is a theoretical scientist. Bertrand Russell is a philosopher and mathematician. Though essentially, they are rationalists, they are also inclined towards spirituality.

వీరిరువురూ ఆధ్యాత్మికత ఆవరించిన తార్కిక వ్యక్తులు. వీరిరువురూ బౌద్దాన్ని ఎందుకు ప్రశంసించారు? బుద్ధుని బోధనల్లో శాస్త్రీయ దృష్టి ఉన్నదా? పదార్ధం, చైతన్యం గురించి బుద్ధుడు ఏమి చెప్పాడు? అని పరిశీలిస్తే నన్ను ఆకర్షించిన, ఆలోచింపజేసిన బుద్ధుని సిద్ధాంతం "నామరూప సిద్ధాంతం/Name and Bodily Form Theory”.

బుద్ధుడు సులభంగా గ్రహించే వీలులేని విషయాలను ఎంతో సూక్ష్మంగా పరిశీలించి మానవుని స్వరూప స్వభావాలను వివరించాడు. బుద్ధుడి బోధనల్లో మానవుడే కేంద్రం. దైవం గురించి చర్చించడానికి బుద్ధుడు ఇష్టపడలేదు.

నామ రూప సిద్ధాంతం చెప్పేదేంటంటే భౌతికమైనవి, మానసికమైనవి కలసి సాకారరూపంగా ఏర్పడతాయి. బుద్ధుడు భౌతికమైన వాటిని రూపఖండమని, మానసికమైన వాటిని నామ ఖండమని అన్నాడు. బుద్ధుడు ఆ కాలం నాటి విజ్ఞానాన్ని అనుసరించి రూప ఖండాన్ని మన్ను, నీరు, నిప్పు, వాయు ధాతువుల సమ్మేళనమని అన్నాడు. ఈ రూప ఖండానికి నామ ఖండం తోడైనపుడు సాకారత ఏర్పడుతుంది.

బుద్ధుడు ఈ నామఖండాన్ని విజ్ఞానము అనగా చేతనత్వంగా పేర్కొన్నాడు. మానసికమైన ధాతువుల సమ్మేళనమే నామ ఖండము. ఈ నామఖండంలో అనుభూతులు, సంజ్ఞలు, సంస్కారాలు అను మూడు విభాగాలు ఉన్నవి. అయితే ఈ చేతనత్వం భౌతికమైన ధాతువులు సమ్మేళనం చెందినపుడే ఉద్భవిస్తుంది. మానవుని పుట్టుకతో ఏర్పడే ఈ చేతనత్వం అతడు చనిపోవడంతో అంతమైపోతుంది.

విద్యుత్తు వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్లే కాయం రూపు చెందడంతో దానితో పాటు చేతనత్వం కూడా ఏర్పడుతుంది. కాబట్టి పదార్ధం లేనిదే చైతన్యం ఉండదు, అదీనూ పదార్దానికి విడిగా చైతన్యానికి అసలు అస్తిత్వమే లేదన్న ఆధునికుల అవగాహనకు బుద్ధుడు అతి చేరువలోనే ఉన్నాడు. ఈ కారణం వల్లనే ఐన్ స్టీన్, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి హేతువాద మానవవాదులకు బౌద్ధం నచ్చింది. బౌద్ధంలో దైవం స్థానంలో ధర్మం ఉన్నది. మానవుడు కేంద్రంగా రూపుదిద్దుకున్న బౌద్ధ ధర్మంలో అంతిమ లక్ష్యం మానవ అభ్యున్నతే.

- ఓం తత్ సత్ -

Posted in October 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!