తెలుగు దోహాలు
- నిమ్న జాతివారలనుచూ, చులకనగా చూడకుము!
జాతి మత భేదములంటూ, హేళన గావించకుము! - ఉపకారమును చేయుటకై , వెనుక అడుగు వేయకు,
అపకారము చేయవలెనను, యోచన అసలు చేయకు! - మెలుగు సఖ్యతగ అందరితో, పంచు స్నేహభావాలు
పదుగురితో కలిసి మెలుగుతు, నిలుపుకొనుము బంధాలు! - ఇంటి ఇంతి ఆనందమే, గృహమున సుఖము నింపును
చిన్నారుల చిరునవ్వులే, ఇంటికి వెలుగు తెచ్చును! - మార్కులు కొలబద్దలైతే, జ్ఞానము వంటబట్టదు
మనసున ఒత్తిడి పెరిగితే, పరిణితి మదిని ముట్టదు! - విడని గట్టి బంధముయనుచు, తెగే దాకా లాగకు,
నమ్మ దగిన వారు అయినా, ఏమరపాటు చూపకు! - జులుము హద్దులు మీరినపుడు, గోవు పులై గర్జించు,
నిస్వార్థపు ప్రేమ దొరికెనా, ఎండు మోడు చిగురించ!. - రేడియేషను పెరిగినచో, ఊపిరి కడగడుతుంది!
ప్రకృతిని పరిహసించినచో, బ్రతుక కష్టమౌతుంది! - కడలి ఆటుపోట్ల వలెనే, బ్రతుకున కష్ట సుఖాలు,
సుఖాల కెరటాల వెనుకే, వచ్చును బాధల అలలు! - చెరువు పూడ్చి కట్టిన ఇళ్ళు, వరదలలో మునిగేను,
నేలను గౌరవించకున్న, కరువు కబళించేను!
మీ సూచనలు జ్ఞప్తికి ఉంచుకుంటాను. ధన్యవాదాలు.
మీ సూచనలు జ్ఞప్తికి ఉంచుకుంటాను.
ధన్యవాదాలండీ!
ప్రయత్నము బాగున్నది.
దోహా లక్షణములు:
పూర్వార్ధము – 13 మాత్రలు, జగణముతో ప్రారంభము నిషిద్ధము, చివర ర,స,న గణములలో ఒకటిగ నుండాలి.
ఉత్తరార్ధము – 11 మాత్రలు, చివర జ లేక తగణము
తెలుగులో ప్రాస, అక్షరసామ్య యతులు ఉండాలి. హిందీ కావున అంత్యప్రాస (తుక్), విరామయతి ఉండాలి. కావున దోహాకు ప్రాస, అంత్య ప్రాస, పాదములలో విరామ, అక్షరసామ్య యతులు అవసరము.
ఒక ఉదాహరణము:
కడలి యాటుపోటు లనగా – కష్టసుఖాలు నిజమ్ము
వెడలు సుఖమ్ముల కెరటములు – వెనుక వచ్చు దుఃఖమ్ము
– మోహన