“సిరిమల్లె” 100వ సంచిక సందర్భముగా
కం. దశదశమసంచిక యిదే దిశలను సౌరభము నింపి దేదీప్యముగా వశపఱచుకొనియె పఠితల వశమా సిరిమల్లెగరిమ పదముల నుడువన్?(1) (1) సిరిమల్లె యొక్క గొప్పతనమును మాటలలో చెప్ప శక్యమా?/ సిరిమల్లె యొక్క గొప్పమాటల(పొందిక)ను తెలుప శక్యమా?/ సిరిమల్లెను గొప్పమాటలలోనైన చెప్ప శక్యమా?/ సిరిమల్లె చేరిన గొప్పస్థానములను (great levels) మాటలతో తెలుప శక్యమా?/ సిరిమల్లె యొక్క గొప్ప అడుగుల గుర్తులను (trail blazed) మాటలలో చెప్ప శక్యమా? (2) పదము = మాట/స్థానము/అడుగుల గుర్తు (3) సిరిమల్లె దిక్కులను తన పరిమళకాంతులతో వశపఱచుకొని దిగ్విజయమును సాధించినది. అందుచేత (1)లో చెప్పినవి పాఠకుల శక్యమా అని కూడ అర్థము చెప్పవచ్చును. క్రమాలంకారము కాకపోయినా సిరిమల్లెలో సహజముగా ఉన్నవే కాంతి (సిరి లక్షణము), పరిమళము (మల్లె లక్షణము). హార్దికాభినందనలతో అయ్యగారి సూర్యనారాయణమూర్తి