౧౧౪౧. చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష.
౧౧౪౨. చిలుం వదిలితేగాని ఫలం దక్కదు.
౧౧౪౩. చిలక ఎగిరిపోయాక ఇంక పంజరంతో పనేముంది...
౧౧౪౪. చిల్లర శ్రీ మహాలక్ష్మి.
౧౧౪౫. చిల్లర దేవుళ్ళకు మొక్కి, చిత్తాన్ని చెడగొట్టుకోకు.
౧౧౪౬. చీకటి ఉంటేనే వెలుగుకి గౌరవం...
౧౧౪౭. చీమ ఒళ్ళు చీమకు బరువు కాదు..
౧౧౪౮. చీమలు పుట్టలు పెడితే, వాటిలో పాములు దూరి కాపురం పెడతాయి.
౧౧౪౯. చీర సింగారించుకొనేసరికి పట్నం మాటుమణిగిందిట!
౧౧౫౦. చుట్టమై వచ్చి, దయ్యమై పట్టుకున్నాడుట!
౧౧౫౧. చుట్ట తాగి, చూరులో దాస్తే, ఇల్లుకాలి బూడిదయ్యిందిట!
౧౧౫౨. చుట్టు అయినా మెట్టదారి మేలు.
౧౧౫౩. చూచి రమ్మంటే కాల్చివచ్చాడుట!
౧౧౫౪. చూసే వారుంటేనే సొమ్ములు పెట్టుకోవాలి, చేసే వారుంటేనే బిడ్డల్ని కనాలి.
౧౧౫౫. చూడబోతే చుట్టాలు, సాయమడిగితే కోపాలు...
౧౧౫౬. చూపుల పసేగాని, ఆవుకి చేపుల పస లేదు.
౧౧౫౭. చూస్తూ ఊరుకుంటే ఆవు, పొలం మేస్తూ పోయింది...
౧౧౫౮. చూస్తే నీది, చూడకపోతే నాది...
౧౧౫౯. చెట్టు ఎక్కేవాడిని మొవ్వుదాకా ఎవరూ ఎగసనదోయరు...
౧౧౬౦. చెట్టు పైకంతా ఎక్కనిచ్చి, నిచ్చెన తీసేసినట్లు...
౧౧౬౧. చెట్టు చచ్చినా చేవ చావదు.
౧౧౬౨. చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి.
౧౧౬౩. చెట్టు నాటిన వాడిదే నీళ్ళు పోసే బాధ్యత.
౧౧౬౪. చెట్టు నాటినదొకడైతే, దాని ఫలాలు తినేది వేరొకడు.
౧౧౬౫. చెట్టు నీడలో సేదదీరబోతే, చెట్టుకొమ్మ విరిగి మీదపడిందిట!
౧౧౬౬. చెట్టు పేరు చెప్పి కాయలంమ్ముకోవాలి.
౧౧౬౭. చెట్టుమీది కాయలు లెక్కపెట్టా, ఇంకొక్క తొమ్మిది కాయలుంటే పదౌతాయి - అన్నాడుట...
౧౧౬౮. చెట్టెక్కి పట్టు విడవకూడదు.
౧౧౬౯. చెడిన కాపురానికి ఇంక ముప్పేమిటి, చంద్రకాంతలు వండవే పెళ్ళామా - అన్నాడుట...
౧౧౭౦. చెడిన ఊరికి ముప్పేమిటి, మొండి కాలుకి చెప్పేమిటి .....