Menu Close
mg

మల్లెపూల మా రాణికి

ప్రేమబంధం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. దానిని వర్ణించడానికి పదాలు చాలవు. మాటలు పలకవు. మల్లెపూలతో చేసిన కిరీటాన్ని ధరింపజేసి, బంతిపూలతో కాళ్ళకు పారాణిని పెట్టడం అనేది కవి కల్పనా ప్రక్రియకు పరాకాష్ట అలాగే దానిని పాట రూపంలో దృశ్యీకరణ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ‘పొగడపూలైనా పొగిడే అందాలే మురిసే మలిసంధ్య వేళలో’ ‘రెల్లుచేలల్లో రేయివేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో’ కవి ప్రకృతి అందాలను అత్యంత సహజంగా నాయికకి అన్వయిస్తూ వేటూరి గారు వ్రాసిన ఈ ప్రేమ గీతం, మనసుకు హత్తుకుపోతుంది. అమరజీవి చిత్రం కోసం చక్రవర్తి గారు స్వరకల్పన చేసిన ఈ గీతానికి బాలు గారి గాత్రం మరింత మాధుర్యాన్ని చేకూర్చింది.

పల్లవి:

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

చరణం 1:

పొగడపూలైనా పొగిడే అందాలే మురిసే మలిసంధ్య వేళలో
మల్లీమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా.... ఆలాపనే
నీ.... ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
హ్యాపీ బర్డే టూ యూ

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

చరణం 2:

రెల్లుచేలల్లో రేయివేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో
నీ.... సౌభాగ్యమే
నా.... సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా
హ్యాపీ బర్డే టూ యూ

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

Posted in February 2021, పాటలు