Menu Close
Kadambam Page Title
విరహం!
ఆదూరి హైమావతి
చెలీ! నా ప్రియ సఖీ!
    నీ విరహం నన్ను రగిలిస్తున్నది.
        నీవు లేక జీవించ లేను.
           ఇంకా ఎన్నాళ్ళిలా ఒంటరిగా?
               జాలే లేదా నాపై ప్రియా?
నీవు లేని ఈ బ్రతుకుకి అర్ధం లేదు.
        నీవు లేని ఈ జీవితం వ్యర్ధం.
          నా కెందుకీ వ్యధా పూరిత జీవనం?
దేవుళ్ళెంత స్వార్ధపరులో కదా!
తన వంట్లో సగం చేసుకున్నాడు-
      ఇష్ట సఖిని,
            ఒకాయన!
తన గుండెలో దాచేసుకున్నాడు-
    ప్రియ సఖిని,
            మరొకాయన!
తన నాలుకపైనే ఉంచేసుకున్నాడు -
          భార్యామణిని,
            విరహం భరించలేక, ఇంకో ఆయన!
మరి మనకు మాత్రం ఎందుకీ ---
     మరిగే వేదన?
మానవుల మైనందుకా?
   అందుకే మనమూ -
కాయం వదలి,
    గాయం మాన్పు కుందాం!
          ఒకరిలో ఒకరం శాశ్వతంగా కల్సిపోదాం.
          ఆ దేవుళ్ళను వెక్కిరిస్తూ విరహమే లేక ఉండిపోదాం.
Posted in February 2021, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *