Menu Close
Geethanjali-page-title

78

WHEN the creation was new and all the stars shone in their first splendor, the gods held their assembly in the sky and sang "Oh, the picture of perfection! The joy unalloyed!"

But one cried of a sudden ⎯ "It seems that somewhere there is a break in the chain of light and one of the stars has been lost." The golden string of their harp snapped, their song stopped, and they cried in dismay ⎯ "Yes, that lost star was the best, she was the glory of all heavens!"

From that day the search is unceasing for her, and the cry goes on from one to the other that in her the world has lost its one joy!

Only in the deepest silence of night the stars smile and whisper among themselves ⎯"Vain is this seeking! Unbroken perfection is over all!"

సీ. చక్కని నీసృష్టి జన్మించు తరుణాన
    చుక్కలన్ని మెరసె నొక్కసారి

    పరిపూర్ణమౌ సృష్టి పరిలేకమును జూచి
    వినుతించిరి సురలు విస్మయమున
----
    "కాంతిహారమ్మున కనుడదె భంగమ్ము
    తారయొకటి తెగె దాని‌నుండి"

    ఆక్రందనము జేసిరంతలో నొక్కరు,
    తీగతెగిన వీణ మూగ బోయె

ఆ. "దివ్యమైన తార దివిసీమకే శోభ
    లేని నాడు మనకు లేదు శాంతి"
    అనుచు వెదకసాగి రమరులలుపులేక
    లేని తార కొరకు రేయిపవలు.

ఆ. నవ్వి పలికెనంత నక్షత్రరాశులు
    సాంద్ర నీరవంపు శార్వరమున
    "కొఱత లేనిదైన పరమాత్మ సృష్టిలో
    వెర్రితనమె కాద వెదుకులాట?"

79

IF it is not my portion to meet thee in this my life then let me ever feel that I have missed thy sight ⎯ let me not forget for a moment, let me carry the pangs of this sorrow in my dreams and in my wakeful hours.

As my days pass in the crowded market of this world and my hands grow full with the daily profits, let me ever feel that I have gained nothing ⎯ let me not forget for a moment, let me carry the pangs of this sorrow in my dreams and in my wakeful hours.

When I sit by the roadside, tired and panting, when I spread my bed low in the dust, let me ever feel that the long journey is still before me ⎯ let me not forget for a moment, let me carry the pangs of this sorrow in my dreams and in my wakeful hours.

When my rooms have been decked out and the flutes sound and the laughter there is loud, let me ever feel that I have not invited thee to my house ⎯ let me not forget for a moment, let me carry the pangs of this sorrow in my dreams and in my wakeful hours.

సీ. ఈ జీవితము లోన, ఎదురుగా నినుజూచు
    ప్రాప్తమ్ము లేకున్న, ప్రార్థనిదియె -

    మరపురానీయకు మనసులో క్షణమైన
    నిన్నుచూడకపోతి నన్న నిజము

    మెలకువ యుండినా, కలలలో దేలినా
    ఈబాధ మోయనీ రేబవళ్ళు
--
    వెలలేని సంపదల్ విపణిలో కల్గినా
    విలువలేదనెరుక నిలువనిమ్ము

ఆ. బ్రతుకు బాట లోన వడిగ పరుగుదీసి
    దారిప్రక్క సుంత తనువువాల్చ
    గమ్యమరగు ఘడియ కడుదూరమని, నాదు
    మదిని యెల్లవేళ మెదల నిమ్ము
--
ఆ. పందిరేసి యింట పండుగన్ జేసితి
    వేణునాద ధ్వనులు వెల్లి విరిసె
    సంబరముల నడుమ సంతోష సమయాన,
    నిన్ను పిలువనైతినన్న వెలితి,

ఆ. కదలనిమ్ము నాదు కఠినహృదయమందు
    నివురుగప్పియున్న నిప్పు వోలె
    స్వప్న జగము‌నందు, జాగ్రత్ప్రపంచాన
    మోయనిమ్ము బాధ రేయిపవలు

80

I AM like a remnant of a cloud of autumn uselessly roaming in the sky, O my sun ever-glorious! Thy touch has not yet melted my vapor, making me one with thy light, and thus I count months and years separated from thee.

If this be thy wish and if this be thy play, then take this fleeting emptiness of mine, paint it with colors, gild it with gold, float it on the wanton wind and spread it in varied wonders.

And again when it shall be thy wish to end this play at night, I shall melt and vanish away in the dark, or it may be in a smile of the white morning, in a coolness of purity transparent.

సీ. శరదాంబుదము వీడి శకలమై గగనాన
    తిరుగాడుచుంటి నే దిక్కు మరచి

    భానుమూర్తీ నీదు భాసలో లీనమై
    ఒకటికాలేక నే ఒంటినైతి

    నీఖేల యీరీతి నీయిచ్ఛయైనచో
    తరళబుద్బుదమైన తనువుపైన,

    రంగురంగులు తీర్చి, బంగారు యంచుతో
    గాలితరగలపై తేలనిమ్ము

ఆ. నిలుపనెంతువేని నీయాట, నిశిలోన
    కరగిపోదు స్వామి, గురుతువిడక!
    నీదు యాజ్ఞయైన, నీహార ప్రాభాత
    అధరహసిత మగుచు యొదిగిపోదు!

81

ON many an idle day have I grieved over lost time. But it is never lost, my lord. Thou hast taken every moment of my life in thine own hands.

Hidden in the heart of things thou art nourishing seeds into sprouts, buds into blossoms, and ripening flowers into fruitfulness.

I was tired and sleeping on my idle bed and imagined all work had ceased. In the morning I woke up and found my garden full with wonders of flowers.

సీ. కరిగెకాలమనుచు కలతచెందితినెంతొ!!
    యెరుగనైతిని నీదు కరుణ స్వామి!

    నాజీవితమున క్షణక్షణమ్మును నీవె
    కాచుచుంటివి నీదు కరమునుంచి

    గుడిజేసి గుండెలన్ గుప్తమ్ముగానుండి
    కదిలించెదవు నీవు కణకణమ్ము

    మొలకెత్తుబీజమ్ము పూవుపండుగమారు
    నీప్రేమ చేతనే నిలుచు జగము

ఆ. అలసి నిదురబోయి అనుకొంటి మదిలోన
    అవని కార్యమంత ఆగెనంచు
    తెరచి జూతు కనులు మరునాటి ఉదయాన
    మురిసి నవ్వు‌చున్న పూలవనము

82

TIME is endless in thy hands, my lord. There is none to count thy minutes.

Days and nights pass and ages bloom and fade like flowers. Thou knowest how to wait. Thy centuries follow each other perfecting a small wild flower.

We have no time to lose, and having no time we must scramble for our chances. We are too poor to be late.

And thus it is that time goes by while I give it to every querulous man who claims it, and thine altar is empty of all offerings to the last.

At the end of the day I hasten in fear lest thy gate be shut; but I find that yet there is time.

సీ. కాలమధీనమై కలదునీ కరములన్
    గణికుడెవ్వడు లేక మనెదవీవు

    వికసించి ముకుళించు, విరులుగా, నీసృష్టి
    నగణితంబై సాగు యుగములెన్నొ

    ఎన్ని శతాబ్దాలు చిన్ని అడవిపూవు
    మలచగా గడిచెనో మహిని స్వామి!

    కాలచోదితులమై కనరాని భవితకై
    అల్పజీవితములో అలమటించు

ఆ. మర్త్యులై బ్రతికెడు మాదు సమయమంత
    పరుష వాక్కులందు తరిగిపోగ
    నీకు నుతులు జేయ నిముషమ్ము కనరాదు
    కాలమంత యిటుల కరగిపోయె

ఆ. పూజవేళ దాట పొడిమాటల మునిగి,
    తలుపు మూతురన్న తలపు చేత
    పరితపించి చాల పరుగుదీసి గుడికి
    ఎదుటనిన్నుజూచి కదలకుంటి

83

MOTHER, I shall weave a chain of pearls for thy neck with my tears of sorrow. The stars have wrought their anklets of light to deck thy feet, but mine will hang upon thy breast.

Wealth and fame come from thee and it is for thee to give or to withhold them. But this my sorrow is absolutely mine own, and when I bring it to thee as my offering thou rewardest me with thy grace.

సీ. అమ్మ!! నీ కల్లెద అశ్రుకణములతో
    అందమౌ ముత్యాల హారమొకటి!!

    మిలమిలా మెరయునీ మింటతారలు నీదు
    పాదమంజీరమై వరలు తల్లి!

    ఎదపైన కదలాడు ఇంపుగా తీర్చు నా
    కన్నీటిమాల నీ కంఠసీమ

    దయతోడ నీవిచ్చు ధనధాన్య భాగ్యాలు
    దూరమవ్వగ వచ్చు, చేర వచ్చు!

ఆ. అంతులేక పారు ఆరిపోని కనుల
    నీరు నాదె తల్లి నిశ్చయముగ
    అర్పణమ్ము జేతునశ్రుమాల నిపుడు
    వరమునిమ్ము‌ మాత! కరుణ తోడ!!

84

IT is the pang of separation that spreads throughout the world and gives birth to shapes innumerable in the infinite sky. It is this sorrow of separation that gazes in silence all night from star to star and becomes lyric among rustling leaves in rainy darkness of July.

It is this overspreading pain that deepens into loves and desires, into sufferings and joys in human homes; and this it is that ever melts and flows in songs through my poet's heart.

సీ. విశ్వమంతట నిండు విరహమే, పుట్టించు,
    రోదసిలో వేల రూపములను

    తార, తార నడుమ తనరు వియోగమే
    ధరణిపై కరుదెంచి, తన్మయమున,

    వర్షఋతువు లోన పాటగా మారియీ
    అడవియాకులలోన అలికిడయ్యె

    ఈ యెడబాటులే యిలపైని‌ మనుజుల
    ఇండ్లలోనికి జేరి యెదల జొచ్చి

ఆ. వలపులై, వదలని వగపులై, తీరని
    కోర్కెలై మెదలెను గుండెలోన
    కవి హృదయము నిదియె కరగించి, ప్రవహించు
    మధుర గాన సుధగ మారెనిపుడు

85

WHEN the warriors came out first from their master's hall, where had they hid their power? Where were their armour and their arms?

They looked poor and helpless, and the arrows were showered upon them on the day they came out from their master's hall. When the warriors marched back again to their master's hall where did they hide their power?

They had dropped the sword and dropped the bow and the arrow; peace was on their foreheads, and they had left the fruits of their life behind them on the day they marched back again to their master's hall.

సీ. ప్రభుసన్నిధిని వీడి బయలుదేరిన, వీరు
    లెటదాచి యుంచిరో దిటవునంత?

    లేవుకవచములు లేవాయుధమ్ములున్
    నిస్త్రాణమై వారు నీరసముగ,

    వెలికివచ్చిన యంత ములుకుశరమ్ములు
    జడివానగా వారి యొడలునింపె

    వెనుదిరిగిన వారు విభుని ప్రాంగణమందు
    దాచిరెచ్చోటనో త్రాణమంత?

ఆ. విల్లు కోల విడిచి వేలమ్ము విడనాడి,
    శాంతినిండు నుదుట కాంతి మెరయ,
    కర్మ ఫలము వీడి కడకుచేరుకొనిరి
    సర్వపాలకుడగు స్వామి నీడ!

*** సశేషం ***

Posted in February 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!