Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట --
డా. వర్జీనియా అప్గర్ (Virginia Apgar)
Virginia-Apgar
(ముందుమాట: ఈ శీర్షికలో ఆంగ్ల పదాలను వాడక తప్పడం లేదు. ఎందుకంటే మన తెలుగులో కొన్ని ఆంగ్ల శాస్త్రీయ పదాలకు సరైన వ్యవహారిక తెలుగు పదాలు లేవు. పాఠకులు గమనించ ప్రార్థన.)

ఈ సృష్టిలో ప్రతి శిశువు తల్లి గర్భంలోనే అన్ని అవయవాల నిర్మాణం, ఇంద్రియాల పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అయితే కొంత మంది శిశువులలో అన్ని ఇంద్రియాలు సరిగా ఏర్పడ్డాయో లేదోననే అనుమానం కలగడం సహజం. అవి శరీరం బయట అయితే కంటితో చూసి నిర్ధారించవచ్చు. కానీ శరీరం లోపలి అవయవాల నిర్మాణం మరియు సామర్ధ్యం ఏపాటిదో చెప్పడం, డెబ్భై ఏళ్ల క్రితం వరకు వైద్య శాస్త్రం అంతగా అందుబాటులో లేని కారణంగా అంత సులభంయ్యేది కాదు. పుట్టిన శిశువు ను అనుభవంతో ఏర్పడ్డ  కొన్ని సంప్రదాయ పద్దతులలో పరీక్షించేవారు. కానీ పందొమ్మిది వందల అరవై నాటికి APGAR అనే విధానాన్ని కనుగొనడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా పుట్టిన శిశువులలో ఏర్పడిన అంగవైకల్యాలను పుట్టిన వెంటనే గుర్తించి తదనుగుణంగా చికిత్సలు చేయడం ద్వారా వారిని కాపాడి వారికి మంచి జీవితం ఇవ్వడం జరుగుతున్నది. ఈ APGAR అనే గొప్ప వైద్య ప్రక్రియ కనుగొనడం వెనుక ఒక మహిళామూర్తి కృషి అద్వితీయము. కనుకనే ఆ విధానాన్ని ఆమె పేరుతోనే నిర్వచించడం జరిగింది. ఆ మానవతామూర్తి పేరు Dr. Virginia Apgar, నేటి మన ఆదర్శమూర్తి.

జూన్ 7, 1909 న, అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం లోని వెస్ట్ ఫీల్డ్ అనే ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వర్జీనియా అప్గర్, బాల్యం నుండే సంగీతం మీద ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఫిడేలు(వయోలిన్) వాయించడంలో పట్టు సాధించింది. స్కూల్ కు వెళ్ళేనాటినుండి విజ్ఞాన శాస్త్రం మీద మక్కువ పెంచుకుంది. చిన్నప్పటినుండి తన తండ్రి చేస్తున్న విజ్ఞాన ప్రయోగాలను, అంతరిక్ష పరిశోధనలను ఆసక్తిగా గమనిస్తూ ఎన్నో విషయాలను అవగతం చేసుకుంది. అంతేకాదు నాడు సమాజంలో ఏర్పడుతున్న ఆరోగ్య రుగ్మతలను గురించి తెలుసుకొని వాటిని మొదట్లోనే ఎందుకు కట్టడి చేయలేమనే భావన తనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. అదే ఆమెను వైద్య రంగంలోకి వచ్చేటట్లు చేసింది. ఎప్పుడూ చలాకీగా ఉంటూ, ఎంతో చతురంగా మాట్లాడుతూ అన్నీ రంగాలలో తనదైన ముద్రను వేసుకొని, చదువులోనే కాదు ఆటపాటలలో కూడా తనకు తననే పోటీగా నిలుపుకొంటూ ఎదిగింది. కనుకనే తన ఉనికిని ఒక మంచి సమాజ శ్రేయస్సుకు దోహదపడిన విధానం ద్వారా చాటుకొంది.

1933 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి MD పట్టాను పొందిన పిదప చేపట్టిన వైద్యవృత్తి నిరంతరం కొనసాగుతూ 1938 సంవత్సరంలో తనకంటూ ఒక గుర్తింపు లభించేలా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న anesthesiology లో అడుగిడి తనదైన ముద్ర వేసింది. 1938 లో తను MD చేసిన Presbyterian Hospital (currently New York-Presbyterian Hospital/Columbia University Medical Center) లోనే Anesthesia డివిజన్ డైరెక్టర్ గా పదవిని పొంది తన సేవలను అందించింది. ఆ తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు వేలకొలది ప్రసవాలను గమనించి తనదైన శైలిలో ఒక ప్రక్రియను రూపొందించింది. దానికి తనే APGAR అని నామకరణం చేసింది.

APGAR అనే విధానాన్ని వైద్య పరిభాషలో, పర భాషలో నిర్వచించాలంటే:

The Apgar score is a qualitative measurement of a newborn’s success in adapting to the environment outside the uterus.

The Apgar score, the very first test given to a newborn in birthing room right after the baby's birth, to evaluate a newborn's physical condition instantly once at 1 minute after birth, and again at 5 minute to see if there's an immediate need for extra medical or emergency care.

Five factors are used to evaluate the baby's condition and each factor is scored on a scale of 0 to 2, with 2 being the best score:

  1. Appearance (skin color)
  2. Pulse (heart rate)
  3. Grimace response (reflexes)
  4. Activity (muscle tone)
  5. Respiration (breathing rate and effort)

Doctors, midwives, or nurses combine these five factors for the Apgar score, which will be between 10 and 0 — 10 is the highest score possible, but it's rarely obtained.

Virginia-Apgar-with-babyఇక్కడ ఒక విషయం గమనించాలి. స్కోర్ తక్కువ వుంటే శిశువు అనారోగ్యంగా ఉన్నట్టు కాదు. కానీ కొంచెం జాగ్రత్తగా, మరింత సావధానంగా పరిశీలించాలని అర్థం. కొన్ని సందర్భాలలో మరింత మెరుగైన వైద్య చికిత్సలు కూడా అవసరం కావచ్చు. ఈ విధానం కనుగొన్న నాటినుండి నేటి వరకు పైన పేర్కొన్న పద్ధతి ద్వారా ఎన్నో లక్షలమంది శిశువులను అంగవైకల్యం మరియు ఇతర లోపాలనుండి రక్షించి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ పద్ధతికి ప్రాణం పోసిన డా.అప్గర్ స్వయంగా తనే ఎన్నో వేల ప్రసవాలకు ప్రాతినిధ్యం వహించి అప్పుడే పుట్టిన  పసికందులను పరీక్షించి వారికి తదనుగుణంగా చికిత్సలు నిర్వహించింది. మనిషి జన్మకు ఇంతకు మించిన సార్ధకత ఏముంటుంది? అంతేకాదు సరికొత్త డివిజన్ గా మొదలైన teratology (the study of birth defects) మొదలు ఎన్నో క్లినికల్ కోర్సులను కార్నెల్, జాన్ హాప్కిన్స్ వంటి పెద్ద విశ్వవిద్యాలయాలలో అధ్యాపకురాలిగా చేరి బోధించింది.

డా.అప్గర్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తనకిష్టమైన సంగీతం, స్టాంప్స్ సేకరించడం, flying తదితర అలవాట్లను కొనసాగిస్తూనే ఉండినది. తన చివరి రోజుల వరకూ కష్టించి పనిచేస్తూ ఎంతో మంది వైద్య విద్యార్థులకు ఒక మెంటార్ గా, ఆదర్శంగా నిలిచారు. తను సృష్టించిన APGAR విధానం ద్వారా మన వైద్యవిజ్ఞానంలో భాగమై పోయిన డా.అప్గర్, కాలేయ సంబధిత వ్యాధితో ఆగష్టు 7, 1974 న పరమపదించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహిళామూర్తికి మరణం లేదు.

Photo credit: March of Dimes / Library of Congress via Wikimedia / Public Domain.
Source-01, Source-02, Source-03, Source-04

Posted in February 2021, వ్యాసాలు

1 Comment

  1. గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    Highly inspiring. ఇలా ఇతర రంగాలకు చెందిన స్ఫూర్తిదాతల్ని పరిచయం చేయడం మీ మంచి ప్రత్యేకత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *