"రాకోయి చందమామ, రాకోయి చందమామ
వింతైన మా గగనయాన ప్రయోగ గాధ వినుమా" అని,
పాడుకుంటూ దిగింది 'విక్రమ్' దక్షిణ ధృవంపైన.
ఆ వార్త విని లోకమంతా నోరువెళ్లబెట్టింది నమ్మలేక
'ఇస్రో' శాస్త్రజ్ఞులైతే కాలరెగరేసారు ధీమా వదలక
తమ లెక్కలు తప్పవని వారికి తెలుసును కనుక.
ఎన్నో ప్రయోగాలు చేసిన లూనా 25,
గిర్రున తిరిగి అదుపుతప్పి దిగుతూ కూలడం
ఇక్కడి వ్యోమగాములకి సహజమే ననిపించింది
కనుకనే అనిపించలేదు సవ్యముగా
చేరగలదని మన 'చాంద్రాయణ్'
వారి భావన తప్పి అందరినీ అబ్బుర పరుస్తూ
సవ్యముగా జాబిల్లిని తాకింది 'చాంద్రాయణ్3'
అదీ అనుకున్న స్థలాన, నిర్ణయించిన క్షణాన్న.
అది వింటూనే
'ఇండియా చంద్రునిపై వాలింద'న్నారు మోడీ
వెంటనే 'ప్రజ్ఞ' చంద్రునిపై 8 మీటర్లు పయనించి చేసింది జోడి!
'ఇస్రో' నమ్మకానికి,
వచ్చేఏడాది చంద్రునిపైకి చేర్చుతుందిట
నాసా ప్రయోగశాల "ప్రవేశ ద్వారం" పేరిట.
మనుషుల తోటి చంద్రునిపై 'ఏమిచెయ్యొచ్చో' ప్రయోగాలు సలపడానికి,
పర్యాటకులని అక్కడచేర్చి వ్యాపారం చెయ్యడానికి.
చంద్రునిపై స్థిరాస్తి అమ్మకాల జోరును పెంచడానికి
ఆస్తుల బేరసారాలు సాగుతున్నాయి అప్పుడే..
"రాకోయి చందమామ, రాకోయి చందమామ
జరుగబోవు వింతలన్నీ చిరునవ్వుతో చూడుమా
నీకు ముద్దులిడ వచ్చేశాము గాంచుమా"