Menu Close
Kadambam Page Title
మరొకరుండరు...
చందలూరి నారాయణరావు

నీవు పుట్టించిన పదాలే ఇవి.
నీ పెదాల వాకిట
నోరు తెరచి ఎదురుచూస్తున్నాయి.

ఏ మాట జంటగా
జాలువారుతుందోనని
పడికాపులు కాస్తు...

కళ్ళ ముందే
అర్థాలు గెంటివేయబడి
కన్న కలే మనసును చిదుముతుంటే..

ఊపిరనుకున్న
"ఆ ఒక్కరు" నీవుగా
ఊరకుండిపోతే ?

ఒకరికి చెబితే
మరొకరు తీర్చేది కాదు
ఆ బాధ.

ఒకరు కాదంటే
మరొకరి ఇచ్చేది కాదు
ఆ ప్రేమ.

నీకై నీవుగా కదలి
నాకై నేనుగా కలసే
ఓ క్షణం వెలిస్తే తప్ప.

Posted in February 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!