పార్వతి దేవి ని స్థుతించేటప్పుడు ఆ దేవిని ఏ పేరుతో పిలిచిననూ అదో రకమైన దివ్యానుభూతి. మాటలకందని భావప్రకంపనల అనుభూతి దేహమంతటా ప్రవహిస్తుంది. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి ఈ మూడు పదాలతో అత్యద్భుతమైన గేయాన్ని రచించాలంటే అది అందరికీ సాధ్యం కాదు. అది కూడా సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ కలకాలం నిలిచి, వినిన ప్రతిసారి ఆ దేవి కటాక్షం కలిగిన అనుభూతి చెందాలంటే మరి ఆ గేయం ఎంత స్థిరమైన నిగూఢ పద సమ్మేళనం అవ్వాలి. అది కేవలం వేటూరి వంటి కారణజన్ములకు మాత్రమె అమరుతుంది. ఈ పాటను చిత్రీకరించిన సందర్భం, సన్నివేశం వేరైననూ ఆ దేవేరిని ఈ విధంగా ఈ కార్తీక పౌర్ణమి శుభ దినాలలో ఈ పాట ద్వారా మరోసారి స్మరించుకుందాం.
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
శృంగారం వాగైనదీ ఆ వాగే వైగైనదీ
ముడిపెట్టే యేరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకధిమితాం
విశ్వనాధుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
యెదలో యమునై పొంగేటి ప్రేమకి మీ సాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలకా దిగి రావా
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసూ మనసూ ఒకటైన జంటకి నీ సాక్షి