పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము)
(అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700
సర్వకళామతల్లికి నమోవాకాలు.
కళానాథ (చంద్ర) స్వరూపిణికి ప్రణామాలు.
కావ్యాలాపంతో వినోదించునట్టి మాతకు ప్రణామాలు.
కుడివైపు లక్ష్మీ, ఎడమవైపు సరస్వతి నిలచి వారిచే సేవింపబడు మాతకు ప్రణామాలు.
ఆదిశక్తియైన మాతకు వందనాలు.
కొలవరాని అతీతమూర్తికి ప్రణామాలు.
ఆత్మస్వరూపిణికి ప్రణామాలు.
ఉత్కృష్ట రూపం కల తల్లికి వందనాలు.
పవిత్రమైన ఆకారం కల జననికి వందనాలు.
అనేక కోటి బ్రహ్మాండాలు తల్లి అయిన దేవికి వందనాలు.
దివ్యస్వరూపం కల తల్లికి ప్రణామాలు.
‘క్లీం’ కామరాజ బీజము. అట్టి క్లీం బీజ స్వరూపిణికి నమస్కారాలు.
సర్వధర్మాతీతయై ‘కేవల’ గా ఉండు అద్వితీయ మూర్తికి వందనాలు.
రహస్యాతి రహస్య స్వరూపిణికి ప్రణామాలు.
సర్వోత్కృష్టమై సామాన్యజన దుర్లభమైన కైవల్యపదాన్ని-తన భక్తజనులకు ప్రసాదించునట్టి తల్లికి వందనాలు.
త్రిపురసుందరీ దేవికి వందనాలు.
ముల్లోకవాసులచే వందనాలందుకొనునట్టి తల్లికి వందనాలు.
త్రిమూర్తి స్వరూపిణికి నమోవాకాలు.
దేవతలకు నాయికయైన ఈశ్వరికి వందనాలు.
వాగ్భవ, కామ, శక్తి-యివి మూడు బీజాక్షరాలు. త్రక్షరీ స్వరూపిణికి వందనాలు.
దివ్యగంధాను లేపనాలతో కూడి భాసిల్లు దేవికి వందనాలు.
సింధూరం తిలకంతో శోభిల్లునట్టి జననికి వందనాలు.
బ్రహ్మ విద్యాధిష్ఠాన దేవియైన ఉమాభగవతికి ప్రణామాలు.
శైలేంద్రుడయిన హిమరాజనందినియగు పర్వత రాజపుత్రికి వందనాలు.
గౌరవర్ణంకల గౌరీదేవికి ప్రణామాలు.
గంధర్వులుచే సేవించబడు జననికి ప్రణామాలు.
విశ్వాన్ని గర్భంలో ధరించిన మాతకు ప్రణామాలు.
స్వర్ణగర్భమూర్తికి ప్రణామాలు.
దుష్టులను అనుగ్రహించని, దుష్టులకు నాస్తికులకు వరాలను యీయని మాతకు నమస్కారాలు.
వాక్కును శాసించునట్టి ఈశ్వరికి ప్రణామాలు.