Menu Close
Lalitha-Sahasranamam-PR page title

ష‌ష్టమ అధ్యాయం (అమ్మవారి భక్తానుగ్రహ తత్పరత)

శ్లోకాలు: 41-43/2, సహస్రనామాలు: 112-131

112. ఓం భవాన్యై నమః

భవుడనగా శంకరుడు, భవశబ్ధానికి సంసార, కామార్థాలు కూడా ఉన్నాయి. వీటిని జయింపజేయు పరమేశ్వరికి ప్రణామాలు.


113. ఓం భావనాగమ్యాయై నమః

భావనాబలంతో తెలిసికోదగిన పరమేశ్వరికి ప్రణామాలు.


114. ఓం భవారణ్య కుఠారికాయై నమః

శోకనిలయమై లోకరూపారణ్యానికి గొడ్డలివంటి స్వరూపంగలదేవికి వందనాలు.


115. ఓం భద్రప్రియాయై నమః

భద్రములయందు- అంటే కళ్యాణ కార్యాలయందు యిష్టము కలది.


116. ఓం భద్రమూర్త్యై నమః

‌కళ్యాణ స్వరూపిణీయైన మాతకు వందనాలు.


117. ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః

తన భక్తులకు సౌభాగ్యాలను ప్రసాదించు మాతకు వందనాలు.


118. ఓం భక్తిప్రియాయై నమః

'భక్తి' అంటే యిష్టముగల శ్రీదేవికి వందనాలు.


119. ఓం భక్తిగమ్యాయై నమః

భక్తి మార్గముద్వారా లభించునట్టి ఈశ్వరికి వందనాలు.


120. ఓం భక్తివశ్యాయై నమః

భక్తివశురాలగునట్టి మహాశక్తి స్వరూపిణికి ప్రణామాలు.


121. ఓం భయాపహాయై నమః

భవభవయాలను అన్నింటినీ రూపుమాపునట్టి మహేశ్వరికి వందనాలు.


122. ఓం శాంభవ్యై నమః

శంభుపత్ని స్వరూపిణియైన శాంభవీ దేవికి వందనాలు.


123. ఓం శారదారాధ్యాయై నమః

శారదాదేవిచే సయితము ఆరాధించబడునట్టి మహాశక్తికి వందనాలు.


124. ఓం శర్వాణ్యై నమః

అష్టమూర్తులలో తేజరిల్లునట్టి శివ స్వరూపాలలో పృధ్వీస్వరూపానికి శర్వుడన్న నామం ఉన్నది. అట్టి శర్వుని ప్రియురాలైన శర్వాణికి వందనాలు.


125. ఓం శర్మదాయిన్యై నమః

తన భక్తి జనావళికి సుఖశాంతులను ప్రసాదించు తల్లికి వందనాలు.


126. ఓం శాంకర్యై నమః

సుఖాలను ప్రసాదించునట్టి శంకరుని ఇల్లాలైన శాంకరికి వందనాలు.


127. ఓం శ్రీ కర్యై నమః

లక్ష్మీ కటాక్షమును ప్రసాదించునట్టి శ్రీ స్వరూపిణికి వందనాలు.


128. ఓం సాధ్వ్యై నమః

అనన్య సాధ్యమైన పాతివ్రత్య ధర్మములు దేవికి నమస్కారాలు.


129. ఓం శరచ్చంద్ర నిభాననాయైనమః

శరదృతువులోని పూర్ణచంద్రునివంటి వదనబింబంకల తల్లికి ప్రణామాలు.


130. ఓం శాతోదర్యై నమః

సూక్ష్మమైన ఉదముకల దేవికి నమస్కారాలు.


131. ఓం శాంతిమత్యై నమః

శాంతమైన బుద్ధి (అంటే అంతరింద్రయ నిగ్రహం కలది.) కల దేవికి ప్రణామాలు.


* * * షష్టమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in June 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!