అన్నదానం కన్నా విద్యాదానం మిన్న,
గురువును మించిన దైవం లేడు.
శిల్పి తన నైపుణ్యంతో బండరాతిని
శిల్పoగా తీర్చిదిద్ది కనువిందుచేస్తాడు
గురువు తన నైపుణ్యంతో విద్యార్థికి
అక్షరసత్యాలను రంగరించి
మంచి నడవడికను, నడతనునేర్పించి
ప్రగతి బాటలో నడిపించి...
అభివృద్ధిబాటలోపయనింప జేసి
ఎనలేనిఆనందాన్నిచవిచూస్తాడు.
పరమేశ్వరుడు ఎలాగైతే బాహ్యచర్యలకు అందకుండా
కేవలం భక్తిచేత ప్రసన్నుడవుతాడో
అలాగే గురువు కూడా నిజమైన
గురుభక్తిచేత మాత్రమే ప్రసన్నుడవుతాడు.
గురువునే దైవంగా పూజించమని
మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి,
గురువుపట్ల మనకున్న అచంచలమైన భక్తి
మన శ్రేయస్సుకు కారణమవుతుంది.
మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ,
సత్యం వద, ధర్మం చర,
సత్యంబ్రూయాత్, సత్యం అహితం,
నబ్రూయాత్ అనే సూత్రాలు
మనసా, వాచా, కర్మణా, ఆచరించేది
మన భారతీయ సంస్కృతి.
సమాజంలో అంతటి మహదానందాన్ని
తల్లిదండ్రుల తరువాత
పొందినవారు ఒక్క గురువులే
గురువులే ప్రతి ఒక్కరికీమార్గ దర్శకులు.
అందుకే....
“గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః” అన్న
ఆర్యోక్తి అక్షర సత్యం.