Menu Close
mg
Song

చుట్టుపక్కల చూడరా చిన్నవాడ

మూఢాచారాల ముసుగులో అగ్రవర్ణాల ఛాందస భావాల సనాతన సూత్రాల ఒరవడిలో మానవత్వం మరిచిపోయి సాటి మనుషుల పట్ల వివక్షను చూపే విధివిధానాలను అలవరుచుకుంటున్న నేటి సమాజ పోకడలను ఎత్తి చూపుతూ మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి ఉండవలసిన కనీస సామాజిక బాధ్యతను గుర్తుచేసే విధంగా మలిచిన ఈ పాట మనందరికీ ఒక ఆదర్శం ముఖ్యంగా భావి తరాల ప్రతినిధులుగా విలసిల్లుతున్న యువతకు. ఇటువంటి పాటను చిత్రించిన దర్శకులు శ్రీ కె. బాలచందర్ గారికి, అలాగే గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, వీనుల విందుగా ఈ పాటకు బాణీ కట్టిన ఇళయరాజా గారికి, ఎంతో హృద్యంగా ఆలపించిన బాలు గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

movie

రుద్రవీణ (1988)

music

సిరివెన్నెల

music

ఇళయరాజా

microphone

ఎస్.పి.బాలు


చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ
కళ్ళముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ
కళ్ళముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ

Posted in September 2023, పాటలు