బరువు నవ్వు!
ఎట్టా మోస్తి వక్క అన్ని బరువుల, చిరునవ్వుల!
తట్టలో దేవుళ్ళ మాగొప్ప బరువు,నిన్నంటుకొని
చిట్టి హాయైన బరువు,మనసులోన కూడు గూడు
నెట్ట, వెరవు బరువు,బూలచ్చి వీవె, దండాలివే!
ఎవ్వడీతడు?!
1.ఉట్టుల దించి పాల్పెరుగుల పంచి, యొలకబోసి
జట్టుకాండ్ర నలరించు స్నేహ వ్రృష్టి బాల క్రృష్ణుడె
మట్టి కుండల పగులగొట్టి నిద్రించు నాడువారి
జుట్టు ముడులేసి జగడముల నవ్వు తుంటరాయె!
2.కొట్టబోయిన తానేడ్చు కంటి కాటుకల కరుగజేయచు
కట్టబోయిన త్రాట జిక్క డెట్టి వాడె బుడత డక్కజమై!!
రాధామనోహరం!!
నల్లని వాడు చల్లని వెన్నెల నవ్వుల వాడు
తెల్లబోయెనో రాధా మనోహర వాగ్వైఖరికి?!
తెల్లని వెల్గుల రాధాబాల మో మెర్రవారెనో
అల్లరి క్రృష్ణు మనోజ్ఞ లీలల కెరుగుదుమే?!!
దారి!!
ఏ జడధారి ఈ దారి హరి కోరి నడచెనో
ఏ జగడాల రారాజు అరి మీది కురికెనో
ఏ జరుగమి,పెంపేద పుర యాత్ర తా పట్టెనో
ఏ *జత లేక నిల్చె వంపు బాట,చెట్లె తోడులై!
*(జత=,attachment)
(ఇట్టా నా మీదుగా పోయి,ఎవరెట్టాపోయినా,నాదేం పూచీ లేదు మరి! అన్నట్టు)