Menu Close
Kadambam Page Title
అల ------కల ...!!
-- డా. కె.ఎల్.వి.ప్రసాద్

నువ్వూ ..నేనూ
ఇక స్పష్టత లేని ..
ప్రేమసముద్రమే!

అలలా వచ్చి
నా ..హృదయాన్ని తాకి,
అందుకోలేనంత
ప్రేమను అందించి,
నేను సందిగ్ధంతో
సతమత మవుతున్న
తరుణంలో..

నువ్వే స్పందించి,
నీ హృదయద్వారం
తెరచి..
అత్మీయంగా నన్ను
అహ్వానించావు..!

అక్షరాల మాలిక అల్లి,
అందమైన నీ మెడలో వేసి,
ప్రేమామృతం పంచుకునే
పరమానంద భరిత క్షణాల,
ఎదురుచూపుల్లో..

నన్ను నిరాశకు గురి చేసి,
సంవత్సరాలు..
క్షణాల్లా కరిగించి,
ఆశల పందిరిలోకి తోసి,
పడి లేచిన కెరటంలా,
కంటికి కానరాక..
కనుమరుగైనావు!

ఊహల ఉయ్యాలలో
ఇప్పుడు..
జ్ఞాపకాల..
హరివిల్లువైనావు..!

కలల రాణివై ..
నా ..హృదయంనుండి,
కదలబోనంటున్నావు..!!

Posted in November 2020, కవితలు

9 Comments

  1. కళావతి కందగట్ల

    అల… కల
    కవిత చాలా బాగుంది.
    dr. Klv. ప్రసాద్ గారికి శుభాకాంక్షలు

  2. Jhansi Koppisetty

    కడలి అలలాంటి మీ కలల రాణి స్మతి కావ్యం బావుంది👌👌👌

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!