Menu Close
Geethanjali-page-title

46

I KNOW not from what distant time thou art ever coming nearer to meet me. Thy sun and stars can never keep thee hidden from me for aye.

In many a morning and eve thy footsteps have been heard and thy messenger has come
within my heart and called me in secret.

I know not why to-day my life is all astir, and a feeling of tremulous joy is passing through my heart.

It is as if the time were come to wind up my work, and I feel in the air a faint smell of thy sweet presence.

సీ. ఎన్నియుగములుగ నన్ను చేరగనీవు
వచ్చుచుంటి‌వి ప్రభూ వసుధనుండ!!

గ్రహతారకల కైన కమల హితునకైన,
దాచతరమ నీదు దర్శనమ్ము
----
నడచివచ్చిన నీదు అడుగుల సవ్వడి
వినిపించు మునిమాపు వేకువలను

ఉల్లమందున చేరి మెల్లగాసంగతి
చేరవేసిరి నీదు చారులిపుడు

ఆ. కుదిపివైచె నేడు ఎదనిండు మాధుర్య
మేలనంచు నేను ఎరుగనైతి
సమయమయ్యె నేమొ! చాలింప పనులన్ని
కదిలె గాలి నీవు,కలవుయనుచు

47

THE night is nearly spent waiting for him in vain. I fear lest in the morning he suddenly come to my door when I have fallen asleep wearied out. Oh friends, leave the way open to him - forbid him not.

If the sound of his steps does not wake me, do not try to rouse me, I pray. I wish not to be called from my sleep by the clamorous choir of birds, by the riot of wind at the festival of morning light. Let me sleep undisturbed even if my lord comes of a sudden to my door.

Ah, my sleep, precious sleep, which only waits for his touch to vanish.

Ah, my closed eyes that would open their lids to the light of his smile when he stands before me like a dream emerging from darkness of sleep.

Let him appear before my sight as the first of all lights and all forms. The first thrill of joy to my awakened soul let it come from his glance. And let my return to myself be immediate return to him.

సీ. రిత్తగా గడచెనీ రేయి నిద్దురలోన
వేచివేచి అతని పిలుపు కొరకు

"నిదురతీరక ముందె నిలుచునేమో ముందు!"
కలతచెందితి నాదు తలపుచేత 

అతని రాకనిపుడు అడ్డగించక మీరు
తలుపుమూయక వేగ తొలగిపొండు

పక్షుల రొదచేత వడిగాడ్పు సడిచేత
*కూరుక చెదరగా కోరుకోను    

ఆ. నిదురపోవ నిండు ఇదియె నాప్రార్థన
వచ్చి యెదుట నిలువ ప్రభువె తాను 
ప్రాణప్రదము నాకు పవళించుట యిటుల
వేడుకొనెద మిమ్ము వేగచనుడు

సీ. హాయినిదుర నాది ఆతని స్పర్శకై,
వేచియున్నదిపుడు వేల కనుల

చిరునవ్వుతో స్వామి చేత నిమిరి నంత
కనులు తెరతు నేను కలలనుండి
---
అన్నిరూపములకు ఆదిబీజమ్మైన
వేలకాంతులకును మూలమైన

నిజరూపము నందు నిలువనిండు యతని
కన్నులెదుట జూచి కరగి పోదు

ఆ. స్వామి చూపుసోకి జాగృతమై యాత్మ
తనిసిపోవు కాద తాకినంత
నన్ను నేను గలియుటన్న ఆనందమే
అతని మ్రోల జేతు అర్పణమ్ము

48

THE morning sea of silence broke into ripples of bird songs; and the flowers were all merry by the roadside; and the wealth of gold was scattered through the rift of the clouds while we busily went on our way and paid no heed.

We sang no glad songs nor played; we went not to the village for barter; we spoke not a word nor smiled; we lingered not on the way. We quickened our pace more and more as the time sped by.

The sun rose to the mid sky and doves cooed in the shade. Withered leaves danced and whirled in the hot air of noon. The shepherd boy drowsed and dreamed in the shadow of the banyan tree, and I laid myself down by the water and stretched my tired limbs on the grass.

My companions laughed at me in scorn; they held their heads high and hurried on; they never looked back nor rested; they vanished in the distant blue haze.

They crossed many meadows and hills, and passed through strange, far-away countries.

All honour to you, heroic host of the interminable path! Mockery and reproach pricked me to rise, but found no response in me. I gave myself up for lost in the depth of a glad humiliation -in the shadow of a dim delight.

The repose of the sun-embroidered green gloom slowly spread over my heart. I forgot for what I had travelled, and I surrendered my mind without struggle to the maze of shadows and songs.

At last, when I woke from my slumber and opened my eyes, I saw thee standing by me, flooding my sleep with thy smile. How I had feared that the path was long and wearisome, and the struggle to reach thee was hard!

సీ. నిశ్శబ్ద జలధిని నింపెనీ ఉదయమ్ము
మత్తకోకిల పాడు మధుర కృతులు

పసిడియంచుల తీరి భాసిల్లు మేఘాలు
విచ్చినవ్విన పూల వింత సొగసు

సాగిపోతిమి మేము వేగమ్ముగా, యింత
సు‌ందర దృశ్యమ్ము చూడ మరచి

ఆటపాటలు లేవు ఆగినవ్వుటలేదు
వడిగ సాగితి మంత బాట వెంట

ఆ. దినకరుండు కదిలె తీవ్రమై గగనాన
పాడుచుండె గువ్వ నీడలోన
కునుకు తీయదొడగె గోపాలుడు అలసి
ఎండు ఆకులన్ని యెగురు చుండె

ఆ. ఏటి వద్దనున్న ఎండుగరిక పైన
అలుపు తీర నేను ఆగినంత
తిరిగి చూడక నను తరలిపోయిరి వేగ,
తోటి వారు మిగుల తూలనాడి

సీ. పచ్చిక బైళ్ళను పర్వత శ్రేణులు
దాటిపోయిరి వారు త్వరిత గతిని

ఎంతచూచిన గాని వింతయౌ నీదారి
అంతులేనిది కాద అవనిలోన

వారిహేళన కొంత బాధించి ఉసిగొల్పు,
‌లోన యెదిరి లేక, లొంగిపోవు

అవమానము మరచి ఆనందమున దేలి
అన్ని వదలివైచి మిన్నకుంటి

ఆ. ఆకుపచ్చ కాంతి ఆవరించె నెదను
కనులు మూసుకొంటి కదలకుండ
ఎందు బోవు చుంటి యేలనో యీయాత్ర
మరచి పోతి నన్ని మగతలోన

ఆ. కన్నుతెరచి కంటి కట్టెదుటనె నిన్ను!
నిండు నవ్వు తోడ నీదు మోము!!!!
వెరచితోయి నిన్ను దరిజేర్చు మార్గమ్ము,
ఎంత కష్టమనుచు ఇన్ని నాళ్ళు!!

49

 

YOU came down from your throne and stood at my cottage door. I was singing all alone in a corner, and the melody caught your ear. You came down and stood at my cottage door. Masters are many in your hall, and songs are sung there at all hours.

But the simple carol of this novice struck at your love.

One plaintive little strain mingled with the great
music of the world, and with a flower for a prize you came down and stopped at my cottage door.

సీ. రత్నఖచిత‌మైన రాజపీఠము వీడి,
చిన్నగూటి గడప జేరినావె!!

నిరుపేద గానమ్ము మురిపించెనో మది?
రక్తి కలిగెనేమొ రాగమందు?

కలరు నీ సభలోన గానగంధర్వులు!
అలరించుటకు నిన్ను అహరహమ్ము!!

నైపుణ్యమేలేని నాపాటకే నీదు,
ప్రేమచిక్కెను యెంత వింత స్వామి!!

ఆ. జగములన్ని నిలుపు సంగీత మాధుర్య
మార్తితోడ నింపి ఆలపించు,
పువుల పూజ నిన్ను, పూరి గుడిసె ముందు
నిలిపెనంచు తెలిసె నిజము నేడు!!!

50

I HAD gone a-begging from door to door in the village path, when thy golden chariot
appeared in the distance like a gorgeous dream and I wondered who was this King of all kings!

My hopes rose high and me thought my evil days were at an end, and I stood waiting for alms to be given unasked and for wealth scattered on all sides in the dust.

The chariot stopped where I stood. Thy glance fell on me and thou earnest down with a smile.

I felt that the luck of my life had come at last. Then of a sudden thou didst hold out thy right hand and say "What hast thou to give to me?"

Ah, what a kingly jest was it to open thy palm to a beggar to beg! I was confused and stood undecided, and then from my wallet I slowly took out the least little grain of corn and gave it to thee.

But how great my surprise when at the day's end I emptied my bag on the floor to find a least little grain of gold among the poor heap. I bitterly wept and wished that I had had the heart to give thee my all

సీ. భిక్షగానిగ నేను వీథివీథి తిరుగ
కంటి, వెలుగుచిందు కనక రథము!!

ఎవ్వరీ రారాజు ఏమి తేజమనుచు!!
ఆశ్చర్యమున జూచి ఆగిపోతి.

కష్టకాలము నేడు కడతేరి పోవంచు
భిక్షకై ఆశతో వేచి యుంటి

రయముగా అరుదెంచి రథమాగె నాముందు
చిరునవ్వుతో నన్ను చేరితీవు

ఆ. పండెపంట యనుచు భాగ్యమున్ కొనియాడ,
"ఏమి తెచ్చితీవు ఏది చూపు"
అనుచు నవ్వితీవు అఖిలేశ నాముందు
పసిడి చేయిచాపి బాలకువలె
----
ఆ. వణకి పోతి నేను!  వరమిచ్చు దాతయే
అడిగినంత నన్ను అప్పనమ్ము!!!
హాస్యమాడు చుంటివనుచు, యిచ్చితి నాదు
జోలె నుంచి చిన్న జొన్న కంకి!!

ఆ. కడకు యింటికేగి కబళంపు రాశిలో
కనక కణికమొకటి కంటి నోయి!!
నాదు సర్వమీయ, లేదేల మనసంచు
వగచినాను స్వామి పొగిలి పొగిలి!!

51

THE night darkened. Our day's works had been done. We thought that the last guest had arrived for the night and the doors in the village were all shut. Only some said, The king was to come. We laughed and said "No, it cannot be!"

It seemed there were knocks at the door and we said it was nothing but the wind. We put out the lamps and lay down to sleep. Only some said, "It is the messenger!" We laughed and said "No, it must be the wind!"

There came a sound in the dead of the night. We sleepily thought it was the distant thunder. The earth shook, the walls rocked, and it troubled us in our sleep.

Only some said, it was the sound of wheels. We said in a drowsy murmur, "No, it must be the rumbling of clouds!"

The night was still dark when the drum sounded. The voice came “Wake up! Delay not! "We pressed our hands on our hearts and shuddered with fear. Some said, "Lo, there is the king's flag!" We stood up on our feet and cried "There is no time for delay!"

The king has come but where are lights, where are wreaths? Where is the throne to seat him? Oh, shame! Oh utter shame! Where is the hall, the decorations? Some one has said, "Vain is this cry! Greet him with empty hands, lead him into thy rooms all bare!"

Open the doors, let the conch-shells be sounded! In the depth of the night has come the king of our dark, dreary house. The thunder roars in the sky.

The darkness shudders with lightning. Bring out thy tattered piece of mat and spread it in the courtyard. With the storm has come of a sudden our king of the fearful night.

సీ. పొద్దుగ్రుంకెను నేడు పూర్తయ్యె పనులన్ని
చివరి యతిథి, యూరు చేరిపోయె

తలుపులన్నియు మూసి తలవాల్చునంతలో
ప్రభువురాలేదంచు పలికిరెవరొ

"స్వామిరాకయిపుడు సాధ్యమా"యని‌నవ్వి
కలల జారుచునుండ, అలికిడయ్యె!!

ప్రభునిదూతేమోని, పల్కిరి కొందరు
గేలిచేసితి నేను గాలియనుచు

ఆ. పెద్ద శబ్ద మొకటి వినిపించె నిదురలో
కంపమొందె పుడమి కదిలె గదులు
స్వామి రథముదనిరి సడివిన్న కొందరు
మేఘ ఘర్జనమని మెదలకుంటి

సీ. కన్ను తెరవ లేదు, కాహళుల్ మ్రోగెను,
"లెండి లెండను" పిల్పు లీలగ విని,

ఝల్లుమనె యొడలు, జారిపోయెను గుండె
ప్రభుడు వచ్చెను యన్న వార్తను విని

"ఏవిదీపమ్ములు? ఎచటపువ్వుల మాల?
ఏది సింహాసన మెచ్చట సభ?"

సిగ్గుపడి కడకు సిద్ధపడితిమంత
రిక్తహస్తముతోడ రేని కొరకు

ఆ. మొరయనిండు భేరి మ్రోగనీ శంఖమ్ము
అదిగొ వచ్చె ప్రభుడు అర్థరాత్రి
మెరిసె గగనమంత ఉరిమె మబ్బులవిగో
చిరుగుపాత తెండి సేవ కొరకు!!

52

THOUGHT I should ask of thee - but I dared not - the rose wreath thou hadst on thy neck. Thus I waited for the morning, when thou didst depart, to find a few fragments on the bed. And like a beggar I searched in the dawn only for a stray petal or two.

Ah me, what is it I find? What token left of thy love? It is no flower, no spices, no vase of perfumed water.

It is thy mighty sword, flashing as a flame, heavy as a bolt of thunder. The young light of morning comes through the window and spreads itself upon thy bed. The morning bird twitters and asks, "Woman, what hast thou got?" No, it is no flower, nor spices, nor vase of perfumed water - it is thy dreadful sword.

I sit and muse in wonder, what gift is this of thine. I can find no place where to hide it. I am ashamed to wear it, frail as I am, and it hurts me when I press it to my bosom. Yet shall I bear in my heart this honour of the burden of pain, this gift of thine.

From now there shall be no fear left for me in this world, and thou shalt be victorious in all my strife. Thou hast left death for my companion and I shall crown him with my life.

Thy sword is with me to cut asunder my bonds, and there shall be no fear left for me in the world.

From now I leave off all petty decorations. Lord of my heart, no more shall there be for me waiting and weeping in corners, no more coyness and sweetness of demeanour.

Thou hast given me thy sword for adornment. No more doll's decorations for me!

సీ. నీ కంఠమాలిక, నాకు కానుకనిమ్ము,
గురుతుగా చేసినే మురిసిపోదు!!

ఎదనుమెదులు కోర్కె యెరిగింపదలచి నే
ధైర్యమ్ము చాలక, తాల్మి గొనుచు,

వేచియుంటినటులె వేకువగు దనుక
రేకులొకటి రెండు సేకరింప!!
----
పరిమళమ్ములు లేవు, విరులగురుతు లేదు
నీ యానవాలుగ నిలుపు కొరకు!!

ఆ. దివ్యప్రభలు జిమ్ము, దేదీప్య మానమౌ
నీదు ఖడ్గమెదుట నిలిచె స్వామి!!!
ఎగురు పులుగు యడిగె యేమ్మిచ్చె ప్రభుడంచు
పలుక లేక పోతి బదులు రాక!!

సీ. విరిమాల కోరితి, కరవాల మొసగితి-
వెందు దాచుదు దీని నేమి జేతు!!!!

బలహీనను కద! నీ భాసుర ఖడ్గమ్ము,
చేతబట్టుకొనగ సిగ్గు పడుదు

కానుకిచ్చినది నా కాంతడేయనెరిగి
కాపాడు కొందెంత కష్టమైన

భయమన్నదిక లేదు, బ్రతుకుపోరాటమున్
గెలిచి వత్తును యెన్ని కలతలున్న

ఆ. మరణ దూతను సహచరునిగా చేసితి
వెంత మాత్ర మైన వంతబడను
ప్రాణములను జేసి భవ్య కిరీటమ్ము
నిలుపుకొందు వాని నెచ్చెలునిగ

సీ. బ్రతుకుబంధనముల భగ్నమ్ము గావింతు
కరవాలమున్ బూని కరము లోన

వెరపులేదిక నాకు విశ్వమందెచటైన
మమకారమెదలోన మాసిపోయె

వీడెదన్ తుచ్ఛమౌ ఆడంబరములన్ని
పాడెదన్ జయగీతి పరవశించి

వెక్కియేడ్చుట లేదు వేచిచూచుటలేదు
వీడిపోయెను నాదు బిడియమంత

ఆ. హొయలు గూర్చు నగలు నయగారములనింక
తలపనోయి స్వామి కలలనైన
వేల కాంతులొలయు వేలమ్మె, నా ప్రభూ!!
మేన భూషగనిక మెరిసి పోవు.

53

BEAUTIFUL is thy wristlet, decked with stars and cunningly wrought in myriad-coloured jewels.

But more beautiful to me thy sword with its curve of lightning like the outspread wings of the divine bird of Vishnu, perfectly poised in the angry red light of the sunset.

It quivers like the one last response of life in ecstasy of pain at the final stroke of death; it shines like the pure flame of being burning up earthly sense with one fierce flash.

Beautiful is thy wristlet, decked with starry gems; but thy sword, O lord of thunder, is wrought with uttermost beauty, terrible to behold or to think of.

సీ. కనులకింపుగ నీదు కర కంకణమ్మది,
మణులతో వెలుగుచు మనసుదోచు

ముంజేతి కంకణమ్మునుమించు, నాకు నీ
మొనదేలు ఖడ్గమ్మె ఘనతరమ్ము

స్థిరముగా నిలుచును గరుడ పక్షమువలె
రాజసమ్ముగ వెల్గు రక్తిమమున

మరణదూత యొడిని చరమ శ్వాసగ నూగు
విషయవాంఛల కాల్చి మసిని జేయు

ఆ. రత్న ఖచితమగుచు రాజిల్లు నోయినీ
కరములోన వెల్గు కంకణమ్ము
ఊహ కందదోయి ఓపజాలని నీదు
ఖఢ్గ కళలుదెలుప కవికి తరమ!

Posted in October 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *